Murder With Fevi Quick : దారుణం.. తన ముందు శృంగారం చేయాలన్న తాంత్రికుడు, ఆ తర్వాత వారి ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపేశాడు

రాజస్తాన్ లో దారుణం జరిగింది. భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ తాంత్రికుడు దారుణానికి ఒడిగట్టాడు. ఫెవి క్విక్ వినియోగించి జంట హత్యలు చేశాడు.

Murder With Fevi Quick : దారుణం.. తన ముందు శృంగారం చేయాలన్న తాంత్రికుడు, ఆ తర్వాత వారి ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపేశాడు

Murder With Fevi Quick : రాజస్తాన్ లో దారుణం జరిగింది. భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ తాంత్రికుడు దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రతిష్టను కాపాడుకునేందుకు రెండు హత్యలు చేశాడు. ఇందుకోసం అతడు వాడిన ఆయుధం ఫెవి క్విక్. అవును, నమ్మబుద్ధి కాకపోయినా ఇది నిజం. ఆ జంట ప్రైవేట్ పార్ట్స్ పై ఫెవి క్విక్ పోసి వారిని కత్తితో నరికి చంపేశాడు.

అతడి పేరు భలేశ్ కుమార్. తాంత్రికుడు. భలేశ్ వద్దకు పూజ కోసం రాహుల్ అతడి భార్య వచ్చే వారు. అదే విధంగా సోను అనే మహిళ, ఆమె భర్త వచ్చే వారు. ఈ క్రమంలో రాహుల్, సోను మధ్య పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

Rajasthan Tantirk

ఈ విషయాన్ని తాంత్రికుడు భలేశ్ కుమార్.. రాహుల్ భార్యకు చెప్పాడు. దీంతో ఈ విషయమై రాహుల్, అతడి భార్య మధ్య గొడవలు జరిగేవి. తన వివాహేతర సంబంధం గురించి తన భార్యకు చెప్పింది తాంత్రికుడే అని తెలియడంతో రాహుల్, సోను కోపంతో ఊగిపోయారు. నీ అంతు చూస్తాం అంటూ తాంత్రికుడిని బెదిరించారు. అతడి మోసాలను బయటపెడతామన్నారు. దీంతో తాంత్రికుడు భయపడిపోయాడు. తనకున్న పేరు, పరపతి పోతుందని కంగారుపడ్డ తాంత్రికుడు.. రాహుల్, సోనులను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకోసం పక్కా స్కెచ్ వేశాడు. ముందుగానే 50 ట్యూబుల ఫెవి క్విక్ కొనుగోలు చేశాడు. అదంతా ఓ బాటిల్ లో నింపుకున్నాడు. ఆ తర్వాత రాహుల్, సోనులను అడవిలోకి రమ్మన్నాడు తాంత్రికుడు. మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే… తన ముందే సెక్స్ చేయాలని వారిని కోరాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ జంట.. దుస్తులు విప్పేసి ఏకాంతంగా గడుపుతున్నారు. అదను చూసి తాంత్రికుడు అప్పటికే సిద్ధం చేసుకున్న ఫెవిక్విక్ ను వారి ప్రైవేట్ పార్ట్స్ పై పోశాడు. దీంతో వారిద్దరి ప్రైవేట్ పార్ట్స్ అతుక్కుపోయి బాధతో విలవిలలాడుతుండగా.. తాంత్రికుడు ఆ ఇద్దరిని కత్తితో నరికి చంపేశాడు.

ప్రైవేట్ పార్ట్స్ అతుక్కుపోవడంతో రాహుల్, సోను నరకం చూశారు. ఇద్దరూ దూరం అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ ప్రైవేట్ పార్ట్ కట్ అయిపోయిందని పోలీసులు తెలిపారు. సోనూకి తీవ్ర గాయాలైనట్టు గుర్తించారు. అదే సమయంలో రాహుల్ గొంతు కోసి చంపాడు తాంత్రికుడు. సోనునూ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

Rajasthan Tantirk

అడవిలో రెండు మృతదేహాలు నగ్న స్థితిలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. 50 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించారు. 200 మందిని విచారించారు. చివరికి మిస్టరీని చేధించారు. తాంత్రికుడు భలేశ్ కుమార్ ని పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారించారు. పోలీసుల విచారణలో తానే నేరం చేసినట్లు భలేశ్ అంగీకరించాడు.