JusticeForGirl : రాజుగాడెక్కడ..? 2,700 సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

రాజు వెళ్లిన దారుల్లో... యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు పరిసరాల్లో మొత్తం 180 వైన్‌షాపుల దగ్గర మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు.

JusticeForGirl : రాజుగాడెక్కడ..? 2,700 సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Where Is Raju

Justice For Girl: హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణంగా చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. రాజు వెళ్లిన దారుల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. రాజు.. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి ఉప్పల్‌ లో బస్సు ఎక్కి… మోత్కూరుకు బస్సులో  వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

మొత్తం 2వేల 700 సీసీ కెమెరాలను ఎనలైజ్ చేస్తున్నారు పోలీసులు. తన టవల్ తో పాటు క్యాప్ ను మోత్కూరు మార్గంలో పడేసినట్టు గుర్తించారు. టవల్,క్యాప్, ఓ కల్లు సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  రాజు వాడిన కవర్ లో రూ.7వందలు గుర్తించారు.

రాజు వెళ్లిన దారుల్లో… యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు పరిసరాల్లో మొత్తం 180 వైన్‌షాపుల దగ్గర మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. పరిసరాలను జల్లెడ పడుతున్నారు. ఈ రాత్రి లోగా పట్టుకుంటామంటున్నారు పోలీసులు. ప్రతి ఒక్కరికీ రాజు ఫొటోలు చూపిస్తూ అలెర్ట్ గా ఉండి తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు.