PRE WEDDING SHOOT: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆసుపత్రిలో కొత్త జంట

గత సోమవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్‌లో జంటపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ప్రస్తుతం కొత్త జంట ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జంట పరిస్థితి విషమంగా ఉంది.

PRE WEDDING SHOOT: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆసుపత్రిలో కొత్త జంట

Pre2

ఇటీవల ట్రెండ్‌గా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్లు కాబోయే వధూవరుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్లలో జరుగుతున్న ప్రమాదాలతో కొన్ని జంటలు ఆసుపత్రుల పాలవుతుంటే, మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. అయినా, ఇంకా సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ వధూవరుల ప్రాణాల మీదకు తెచ్చింది. గత సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

Pre Wedding Shoot : అరెరే ఎంతపనాయే.. బురదలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో సోమవారం ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది. ఈ షూట్‌లో భాగంగా మంట వెలిగించారు. దీన్నుంచి విపరీతంగా పొగ రావడంతో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడి ఘటనలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ జంట మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ జంట పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన జంట ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వస్తోంది.