Raped : కూతురిపై ఏడాదిన్నరగా తండ్రి అత్యాచారం

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురినే కాటేశాడో కసాయి తండ్రి. కూతురిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో చేటు చేసుకుంది.

Raped : కూతురిపై ఏడాదిన్నరగా తండ్రి అత్యాచారం

Rape (1)

father raped the daughter : అమ్మాయిలకు బయటనే కాకుండా ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. బయటి వ్యక్తులే కాకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా లైంగికంగా వేధిస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురినే కాటేశాడో కసాయి తండ్రి. వావివరసలు మరిచి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కన్న కూతురిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో చేటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. 35 సంవత్సరాలు వయసు కలిగిన ఇంటి యజమాని ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. అతడికి కూతురు(13), కుమారుడు(11) ఉన్నారు. కూతురు ప్రైవేట్ స్కూల్ లో 7వ తరగతి చదువుతోంది. గత ఏడాది మార్చి నెల నుంచి కూతురిని తండ్రి లైంగికంగా వేధిస్తున్నాడు.

Minor Rape : ముంబైలో మరో దారుణం.. రైల్వే స్టేషన్‌లో బాలికపై అత్యాచారం

భార్య నిద్ర పోయిన తర్వాత పక్కనే పడుకున్న కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. భార్య ఇంట్లో లేనప్పుడల్లా అత్యాచారం చేస్తున్నాడు. ఈ నెల 8, 10వ తేదీల్లోనూ అత్యాచారం చేయడంతో భరించలేని కూతురు.. తాను ఇక్కడ ఉండలేనని నానమ్మ ఇంటికి వెళ్లిపోతానని తల్లికి చెప్పింది. ఏం జరిగిందని నిలదీయడంతో.. జరిగిన విషయం చెప్పింది.

ఇద్దరూ కలిసి అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై పోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు నిమిత్తం దిశ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలిక నివాస ప్రాంతాన్ని విజయవాడ నార్త్‌ జోన్‌ ఏసీపీ షేక్‌ షాను, సీఐ లక్ష్మీనారాయణ పరిశీలించారు.