Chain Snatching : సికింద్రాబాద్‌లో వరుస చైన్‌స్నాచింగ్ లు

సికింద్రాబాద్ నార్త్‌జోన్  పోలీసు సర్కిల్ పరిధిలో ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్‌ ఘటనలు చోటు చేసుకున్నాయి.

Chain Snatching : సికింద్రాబాద్‌లో వరుస చైన్‌స్నాచింగ్ లు

Chain Snatching

Chain Snatching :  సికింద్రాబాద్ నార్త్‌జోన్  పోలీసు సర్కిల్ పరిధిలో ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్‌ ఘటనలు చోటు చేసుకున్నాయి. మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విజయ అనే మహిళ మెడలోంచి 4తులాల బంగార గొలుసు తీసుకొని పరారీ కాగా, దానికి ఒక కిలోమీటర్ దూరంలోనే తూకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో రాంబాయి అనే మరో మహిళ మెడలో నుండి మూడున్నర తులాల చైన్ ను దుండగులు తెంచుకుపోయారు.

మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సంజీవయ్య కాలానికి చెందిన విజయ తమ ఇంటికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేట్ హస్ఫటల్ కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుకవైపు నుండి పల్సర్ వాహనంపై వచ్చిన దుండగుడు మెడలోని చైన్ లాక్కొని పారిపోయాడు. ఈరోజు ఉదయం 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని బాధితురాలు తెలిపింది.

ఇది జరిగిన తర్వాత….మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో,  మరోక ఘటన   చోటు  చేసుకుంది. ఉదయం గొలుసు  తెంపుకు పోయిన  స్ధలానికి  కిలోమీటర్ దూరంలోనే తుకారాం  గేట్ పోలీసు స్టేషన్  పరిధిలో    రాంబాయి అనే మరో మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారం గొలుసు లాక్కొని పారిపోయాడు మరో దుండగుడు.
Also Read : Raima Islam Shimu : గోనె సంచిలో శవమై తేలిన ప్రముఖ నటి
దీంతో బాధితులిద్దరూ పోలీసులకు పిర్యాదు చేసారు. వెంటనే  ఘటనా   స్ధలాలకు  చేరుకున్న పోలీసులు   సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.  రెండో ఘటనలో   చోరీకి వాడిన వాహనం యాక్టివా గా   గుర్తించిన పోలీసులు…  వెహికల్  నంబర్ ను కూడా సీసీ టీవీ ఫుటేజి లో  గుర్తించినట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్   పోలీసులు సైతం రంగంలోకి దిగారు.. ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి త్వరలోనే  నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.