Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు, పిచ్చకొట్టుడు కొట్టిన జనాలు.. సినిమా థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం, వైరల్ వీడియో

భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారా? అంటూ వారిని చితక్కొట్టారు.Pakistan Zindabad - Gadar 2

Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు, పిచ్చకొట్టుడు కొట్టిన జనాలు.. సినిమా థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం, వైరల్ వీడియో

Pakistan Zindabad - Gadar 2 (Photo : Google)

Pakistan Zindabad – Gadar 2 : పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారని ఇద్దరిని జనాలు కుమ్మేశారు. పిచ్చకొట్టుడు కొట్టారు. కుమ్మి కుమ్మి పడేశారు. ఆ ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. ఓ సినిమా థియేటర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో క్లారిటీ లేదు. కానీ, సినిమా థియేటర్ లో జరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్-2 సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బోర్డర్ లోని పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2011లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గదర్ కు ఈ సినిమా సీక్వెల్. ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది.

Also Read..Man Shot : షాకింగ్.. కూతురిని భుజాలపై మోసుకెళ్తున్న తండ్రి, ఇంతలో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

గదర్-2 సినిమా ప్రదర్శితం అవుతున్న ఓ థియేటర్ లోనే ఈ ఘటన జరిగింది. సినిమా చూస్తున్న సమయంలో సడెన్ గా ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతే, చుట్టుపక్కల ఉన్న వారికి మండిపోయింది. వారిలో కోపం కట్టలు తెంచుకుంది. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారా? అంటూ వారిని చితక్కొట్టారు. మీరు దేశద్రోహులు అంటూ.. చుట్టూ చేరిన జనం వారిద్దరికీ దేహశుద్ధి చేశారు. కుమ్ముడు కుమ్మారు. అంతా కలిసి ఆ ఇద్దరిని పిచ్చకొట్టుడు కొట్టారు. వారికి సినిమా హాల్ లోనే సినిమా చూపించారు. మరోసారి పిచ్చికూతలు కూస్తే బాక్స్ బద్దలవుతుందని హెచ్చరించి వదిలేశారు.

ఆ వ్యక్తులను కొడుతున్న సమయంలో గదర్ సినిమాలోనూ ఫైటింగ్ సీన్ రావడం వీడియోలో కనిపిస్తుంది. గట్టిగా అరుస్తూ హీరో ఓ వ్యక్తికి వార్నింగ్ ఇస్తుంటాడు.