Wife Stunning Plan : బాబోయ్.. భర్తను చంపేందుకు భార్య ఖతర్నాక్ ప్లాన్.. రోజూ కాఫీలో విషం కలిపి, అతడు ఎలా కనిపెట్టాడంటే..

మూడో కంటికి తెలియకుండా, తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా భర్తను మట్టుబెట్టాలని అనుకుంది. కానీ, పాపం అడ్డంగా దొరికిపోయింది. Coffee Poisoning :

Wife Stunning Plan : బాబోయ్.. భర్తను చంపేందుకు భార్య ఖతర్నాక్ ప్లాన్.. రోజూ కాఫీలో విషం కలిపి, అతడు ఎలా కనిపెట్టాడంటే..

Coffee Poisoning (Photo : Google)

Updated On : August 7, 2023 / 11:47 PM IST

Coffee Poisoning : ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు ఎక్కువైపోయాయి. జీవితాంతం తోడు నీడగా ఉంటానని బాస చేసి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలే హంతకులుగా మారుతున్నారు. ఒకరినొకరు చంపుకుంటున్నారు. కట్టుకున్న భార్యను భర్త, సొంత భర్తను భార్య చంపుకుంటున్నారు. అనుమానంతో కొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు.

ఇందుకోసం వారు వేస్తున్న ఖతర్నాక్ స్కెచ్ లకు, క్రిమినల్ మైండ్స్ కు పోలీసులే విస్తుపోతున్నారు. వామ్మో అని నివ్వెరపోతున్నారు. తాజాగా ఓ భార్య తన భర్తను చంపేందుకు ఖతర్నాక్ స్కెచ్ వేసింది. మూడో కంటికి తెలియకుండా, తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా భర్తను మట్టుబెట్టాలని అనుకుంది. కానీ, పాపం అడ్డంగా దొరికిపోయింది. భర్త తెలివితేటల ముందు ఆమె పప్పులు ఉడకలేదు.

Also Read..Car Explodes : బాబోయ్.. బాంబులా పేలిపోయిన కారు, ఒకరి మృతి, ఇంట్లో పార్కింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. అసలేం జరిగింది?

ఓ భార్య తన భర్తను హత్య చేసేందుకు కాఫీలో విషం కలిపి ఇచ్చిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. మెలోడి ఫెలికానో జాన్సన్, రాబీ జాన్సన్ దంపతులు. అయితే, భర్తను చంపేందుకు భార్య స్కెచ్ వేసింది. అతను తాగే కాఫీలో రోజూ విష పదార్ధం కలిపేది. అయితే, రుచిలో తేడా రావడంతో భర్తకు ఎక్కడో అనుమానం వచ్చింది. సమ్ థింగ్ రాంగ్ అని అతడి సిక్స్త్ సెన్స్ చెప్పింది. వెంటనే అలర్ట్ అయ్యాడు.

కాఫీ రుచిలో తేడా గమనించిన భర్త.. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని భార్యకు తెలియకుండా ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అలా నెలల తరబడి కాఫీ తాగుతున్నట్లు నటించాడు. చివరికి భార్య బండారాన్ని బట్టబయలు చేశాడు. రెడ్ హ్యాండెడ్ గా భార్యను పట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

రాబీ జాన్సన్, మెలోడీ ఫెలికానో జాన్సన్ దంపతులు. రాబీ జాన్సన్ అమెరికా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాంతో విడాకులకు అప్లయ్ చేశారు. కోర్టులో కేసు నడుస్తోంది. విడాకులకు అప్లయ్ చేసుకున్నప్పటికీ ఇద్దరూ కలిసి తమ పిల్లలతో ఒకే ఇంట్లో ఉండేవారు. భార్య తనకు రోజూ ఇచ్చే కాఫీలో ఏదో కలుపుతున్నట్లు భర్తకు అనుమానం వచ్చింది. దాంతో అతడు అలర్ట్ అయ్యాడు.

Also Read..Electricity Bill Kills : దారుణం.. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని మీటర్ రీడింగ్ ఉద్యోగి దారుణ హత్య

భార్య ఇచ్చిన కాఫీ తాగుతున్నట్లు నటించాడు. కానీ తాగేవాడు కాదు. అలా కొన్ని నెలల పాటు చేశాడు. భార్య మీద అనుమానంతో సీక్రెట్ కెమెరాలు బిగించాడు. తనకు రోజూ ఇచ్చే కాఫీలో విషం కలుపుతున్నట్లు సీక్రెట్ కెమెరాల ద్వారా అతడు కనుగొని షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. భర్త ఫిర్యాదుతో భార్యను అరెస్ట్ చేశారు.