Love Affair : ప్రేమించాడని యువకుడిని చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు

హనుమకొండ జిల్లాలో  దారుణం చోటు చేసుకుంది. యువతిని ప్రేమించిన పాపానికి ఆమె కుటుంబ సభ్యులు ఒక యువకుడిని వారంరోజులుగా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. 

Love Affair : ప్రేమించాడని యువకుడిని చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు

love Affair

Love Affair : హనుమకొండ జిల్లాలో  దారుణం చోటు చేసుకుంది. యువతిని ప్రేమించిన పాపానికి ఆమె కుటుంబ సభ్యులు ఒక యువకుడిని వారం  రోజులుగా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు.  యువకుడిని హింసించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడటంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేసి యువకుడిని విడిపించి ఆస్పత్రిలో చేర్పించారు.

వివరాల్లోకి వెళితే…. కాజీపేట్ డీజిల్  కాలనీలో ప్రసాద్ అనే యువకుడు  ఒక ఇంట్లో   అద్దెకు ఉంటున్నాడు.  ప్రసాద్ కు ఆ ఇంటి యజమాని కుమార్తెతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ స్నేహంగా ఉండటం  ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు.  దీంతో  వారం రోజుల క్రితం వారు ప్రసాద్ ను ఒక గదిలో నిర్బంధించి, కాళ్లు చేతులు కట్టేసి చిత్ర హింసలకు గురిచేశారు.
Also Read : PM Modi ICRISAT : ఇక్రిశాట్ గోల్డెన్‌జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గోనున్న ప్రధాని మోదీ

చిత్ర హింసలకు గురిచేస్తున్న ఫోటోలను  తీసి ప్రసాద్ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు వాట్సప్  ద్వారా పంపించారు.  దీంతో అలర్టైన  ప్రసాద్ కుటుంబ సభ్యులు  వెంటనే కాజీపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్నపోలీసులు ప్రసాద్ ను  విడిపించి చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.