Earn Money : ఆధార్, పోస్టాఫీస్ ఫ్రాంచైజీలు..! ఊళ్లోనే ఉంటూ డబ్బులు సంపాదించొచ్చు!!

ఊళ్లోనే ఉండి..సొంతంగా బిజినెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకొనే బ్రహ్మాండమైన అవకాశం ఉంది.

Earn Money : ఆధార్, పోస్టాఫీస్ ఫ్రాంచైజీలు..! ఊళ్లోనే ఉంటూ డబ్బులు సంపాదించొచ్చు!!

Post Office, Aadhar

Updated On : September 19, 2021 / 1:33 PM IST

AAdhaar And Post Office : ఉన్నత చదువులు చదివినా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకడం కష్టతరమై పోతోంది. జాబ్ లకు విపరీతమైన డిమాండ్స్ ఏర్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ..ఇక్కడ విపరీతమైన పోటీ ఉండడంతో ప్రైవేటు ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ఉద్యోగం ఎందుకులే..అనుకుని ఏదైనా బిజినెస్ చేస్తున్నారు. సొంతంగా బిజినెస్ పెట్టాలంటే..లక్షలాది రూపాయలు కావాల్సి ఉంటుంది. సొంత బిజినెస్ లు స్టార్ట్ చేసుకొనే అవకాశం ఉంది. ఇందులో తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం ఉంటుంది. ఊళ్లోనే ఉండి..సొంతంగా బిజినెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకొనే బ్రహ్మాండమైన అవకాశం ఉంది.

Read More : Ganesh Idol is Immersed : గణేషుడ్నే ఎందుకు నిమజ్జనం చేస్తారు ?

Aadhar Kendra

ఏంటా బిజినెస్ : –
ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్ అనే విషయం తెలిసిందే కదా. సిమ్ కార్డు నుంచి బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్నా..ఆధార్ కార్డు కంపల్సరీ. అందుకే..ఆధార్ కార్డు ఫ్రాంచైజ్ తీసుకుంటే..మంచి ఆదాయం వస్తుంది. ఆధార్ కార్డు ఫ్రాంచైజ్ ఏర్పాటు చేయాలంటే..ముందు యూఐడఏఈ (UIDAI) నిర్వహించే పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తారు. దీనిని ఉపయోగించి..ఊళ్లో ఎక్కడైనా నచ్చిన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు సర్వీసుల మీద డబ్బులు సంపాదించుకొనే అవకాశం ఉంది. https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్ల‌యి చేసుకోవాల్సి ఉంటుంది.

Read More : Ganesh Laddu: మై హోం భూజా, బాలాపూర్ లడ్డూల వేలంలో రికార్డు ధర

Post Office

మరొకటి..పోస్టాఫీస్ ఫ్రాంచైజ్
ఈ ఫ్రాంచైజ్ ను ఇండియన్ పోస్టు సంస్థ అందిస్తుంది. కేవలం రూ. 5000 వేలు కడితే…ఈ ఫ్రాంచైజ్ లైసెన్స్ ను ఇండియన్ పోస్టు ఇస్తుంది. పోస్టు సేవలను కస్టమర్లకు అందిస్తూ..కమిషన్ సంపాదించుకోవచ్చు. ఇందులో రెండు రకాల ఫ్రాంచైజ్ లు ఉంటాయి. ఒకటి ఔట్ లెట్, మరొకటి పోస్టల్ ఏజెంట్స్ ఫ్రాంచైజ్. ఇండియా పోస్టు వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.

Franchise pdf file