Replacement : టీఎస్ఏసీఎస్ లో 34 ఖాళీల భర్తీ

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా మార్చి 31, 2022గా నిర్ణయించారు.

Replacement : టీఎస్ఏసీఎస్ లో 34 ఖాళీల భర్తీ

Tsacs Jobs

Replacement : నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రొగ్రాం కింద తెలంగాణాలోని టీఎస్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ( టీఎస్ఏసీఎస్)లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

పోస్టులు, ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఐసీటీసీ కౌన్సెలర్ 16 ఖాళీలు, డీఎస్ఆర్సీ కౌన్సెలర్ 10ఖాళీలు, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్లు 8ఖాళీలు, ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జక్టుల్లో బీఎస్సీ ఎంఎల్టీ, పీజీ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా మార్చి 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://tsacs.telangana.gov.in/ సంప్రదించగలరు