Jobs : సిఐఎస్ ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

వయసు 18 ఏళ్లు, 23 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80-85 సెంటీమీటర్లు ఉండాలి.

Jobs : సిఐఎస్ ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

Cisf Jobs

Jobs : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ ఎఫ్) కానిస్టేబుల్ ఫైర్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1149 కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు పురుష అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి జనరల్ కేటగిరీకి 489 సీట్లు ఖరారు చేశారు. ఓబీసీకి 249, ఈడబ్ల్యూఎస్‌కు 113, ఎస్సీకి 161, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 137 సీట్లు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు 18 ఏళ్లు, 23 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80-85 సెంటీమీటర్లు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికవుతారు. చివరగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులను అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ దరఖాస్తులు పంపేందుకు మార్చి 4, 2022 చివరితేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ cisf.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.