Navodaya : తెలంగాణా నవోదయ స్కూల్స్ లో ఉద్యోగాలకు ఎంపిక

పీజీటీ కెమిస్ట్రీ విభాగంలో 1 ఖాళీ ఉంది. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ లో బోధించగలగాలి.

Navodaya : తెలంగాణా నవోదయ స్కూల్స్ లో ఉద్యోగాలకు ఎంపిక

Jobs (1)

Navodaya : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తెలంగాణాలోని నవోదయ స్కూల్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయలో పలు ఖాళీలను ఈనోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలాంటి రాతపరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీ వివరాలు ;

పీజీటీ కెమిస్ట్రీ విభాగంలో 1 ఖాళీ ఉంది. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ లో బోధించగలగాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 50 ఏళ్లు కలిగి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35,750 వేతనం చెల్లిస్తారు.

పీజీటి ఫిజిక్స్ విభాగంలో 1 ఖాళీ ఉంది. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ లో బోధించగలగాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 50 ఏళ్లు కలిగి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35,750 వేతనం చెల్లిస్తారు.

మ్యాట్రన్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 35 నుంచి 50 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 18న గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లాలోని నవోదయ విద్యాలయలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.