Telangana Jobs : తెలంగాణలో మరో 1433 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ ప్రభుత్వం 1433 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఖాళీల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని వివిధ క్యాడర్ కు సంబంధించి ఖాళీగా ఉన్న 1433 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Jobs : తెలంగాణలో మరో 1433 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Telangana Government Green Signal For Another 1433 Jobs (1)

Telangana Jobs: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగులకు  సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి దశలవారీగా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తోంది.కొన్ని రోజులుగా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. మరో 1433 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఖాళీల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని వివిధ క్యాడర్ కు సంబంధించి ఖాళీగా ఉన్న 1433 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంట్లో భాగంగా తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 91 వేల 142 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు.ఇందులో 11 వేల 103 మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. కాంటాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మిగిలిన 80 వేల 39 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.వివిధ శాఖల ఖాళీలను గుర్తించి దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. 503 గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ రాగా.. దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక పోలీస్, రవాణాస అటవీ, ఎక్స్సైజ్ శాఖల్లో 33 వేల 787 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటికి సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.

వైద్యశాఖలో గుర్తించిన 12 వేల 775 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. మెడికల్ కు సంబంధించి 10 వేల 28 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. తొలి విడతగా 13 వందల 26 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయి. కేసీఆర్ చెప్పిన ఖాళీల ప్రకారం మిగిలిన ఆయా శాఖాల్లోని ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది.