Railways Training : పదిపాసైతే చాలు..ఉచిత శిక్షణతోపాటు, రైల్వేలో ఉద్యోగం

శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా రైల్వేలకు చెందిన 75 సంస్థలు ఈ శిక్షణను అందిస్తాయి. మూడు వారాల శిక్షణ కార్యక్రమం. ఇందులో ప్రాక్టికల్, థియరీ రెండూ ఉంటాయి.

Railways Training : పదిపాసైతే చాలు..ఉచిత శిక్షణతోపాటు, రైల్వేలో ఉద్యోగం

Rkvy (1)

Railways Training : ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు రైల్ కౌశల్ వికాస్ యోజన పేరుతో శిక్షణా కార్యక్రమం చేపట్టింది. యువత స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఇది ఉపకరించనుంది. నిరుద్యోగులు వారి ఆసక్తి బట్టి ట్రైనింగ్ పొందవచ్చు. శిక్షణ తరువాత వారు స్వయం ఉపాధికి కూడా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రైల్వేలో టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ సమయంలో ప్రాధాన్యత ఉంటుంది. ఇతర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

భారత రైల్వేకు సంబంధించిన శిక్షణా సంస్థల ద్వారా పారిశ్రామిక రంగాలకు చెందిన విభాగాలలో శిక్షణతో పాటు టూల్ కిట్‌లు అందిస్తారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించడం రైల్ కౌశల్ వికాస్ యోజన ప్రధాన ఉద్దేశం. ఆర్‌కేవివై ప్రోగ్రామ్‌కు ఇండియన్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ అయిన బనారస్ లోకోమోటివ్ వర్స్క్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. కోర్సు కంటెంట్, ట్రైనింగ్ అసెస్మెంట్ ప్రక్రియ ప్రొడక్షన్ యూనిట్ తయారు చేస్తుంది. నాలుగు అంశాల్లో మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో శిక్షణ అందిస్తారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తారు. ఎవరైనా స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అవసరమైన ప్రోత్సాహం అందిస్తారు.

శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా రైల్వేలకు చెందిన 75 సంస్థలు ఈ శిక్షణను అందిస్తాయి. మూడు వారాల శిక్షణ కార్యక్రమం. ఇందులో ప్రాక్టికల్, థియరీ రెండూ ఉంటాయి. మెషినిస్టు, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అనే నాలుగు ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తారు. మారుమూల ప్రాంతాలలోని యువతకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా మొబైల్ యూనిట్ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నారు. రైల్వేలకు పనికివచ్చే ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షణ ఇస్తారు. మూడేళ్లలో 50 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు శిక్షణకు అర్హులు. మంచి ఫిట్‌నెస్‌ కలిగిఉండటం, రిజిస్టర్డ్ ఎంబీబీఎస్ వైద్యుడి నుంచి చూపు, వినికిడి, మానసిక ఆరోగ్యం బాగున్నాయనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ దరఖాస్తు పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఎలాంటి అంటువ్యాధులు లేవనే ధ్రువీకరణ అవసరం. ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. అప్లికేషన్లు ఆన్‌లైన్లో కూడా తీసుకుంటారు. శిక్షణ ముగిసిన తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇనిస్టిట్యూట్ సర్టిఫికేట్లను అందజేస్తుంది. దరఖాస్తు చేరాల్సిన చివరి తేదీ ఫిబ్రవరి 21, 2022. పూర్తి వివరాలకు https://railkvy.indianrailways.gov.in/rkvy_userHome/ సంప్రదించాలి.