NIVEDI Recruitment : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌డిగ్రీ' ఎంబీఏ/ ఎంఎన్సీ/ ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 18-45 ఏళ్లు ఉండాలి.

NIVEDI Recruitment : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Vacancies in National Institute of Veterinary Epidemiology and Disease Information

NIVEDI Recruitment : బెంగళూరుకు చెందిన ఐకార్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డినీజ్‌ ఇన్ఫర్మేషన్‌(ఎన్‌ఐవీఈడీఐ) పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సీనియర్‌ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌డిగ్రీ’ ఎంబీఏ/ ఎంఎన్సీ/ ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 18-45 ఏళ్లు ఉండాలి. స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15000-రూ.0000 చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఐకార్ , నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్. రామగొండనహళ్లి, పోస్ట్ బాక్స్ నెం ; 6450,ఎలహంకా, బెంగుళూరు 560064, దరఖాస్తుకు చివరి తేదిగా ఫిబ్రవరి 13, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nivedi.res.in పరిశీలించగలరు.