Assembly Elections 2023: 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల

ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 63 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 56 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Assembly Elections 2023: 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల

BSP 2nd List for Telanaga Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ రెండో జాబితా విడుదలైంది. రెండో జాబితాలో 43 మంది అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 63 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 56 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

రెండో జాబితాలోని అభ్యర్థులు వీరే..
1. బెల్లంపల్లి(ఎస్సీ) –జాడీ నర్సయ్య
2. మంచార్యాల–తోట శ్రీనివాస్
3. ఆసిఫాబాద్ (ఎస్టీ) –కనక ప్రభాకర్
4. బోథ్(ఎస్టీ)–మెస్రాం జంగుబాపు
5. కామారెడ్డి –ఉడతావర్ సురేష్ గౌడ్
6. కోరుట్ల– నిశాంత్ కార్తీకేయ గౌడ్
7. జగిత్యాల–బల్కం మల్లేష్ యాదవ్
8. రామగుండం–అంబటి నరేష్ యాదవ్
9. సిరిసిల్ల–పిట్టల భూమేష్ ముదిరాజ్
10. హుజూరాబాద్ –పల్లె ప్రశాంత్ గౌడ్
11. దుబ్బాక–సల్కం మల్లేష్ యాదవ్
12. ఉప్పల్– సుంకర నరేష్
13. రాజెందర్ నగర్–ప్రొ. అన్వర్ ఖాన్
14. చేవేళ్ల(ఎస్సీ)–తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ
15. పరిగి–యంకెపల్లి ఆనంద్
16. మలక్ పేట్–అల్లగోల రమేష్
17. నాంపల్లి–మౌలానా షఫీ మసూదీ
18. చంద్రాయణగుట్ట- మూల రామ్ చరణ్ దాస్
19. కొడంగల్–కురువ నర్మద కిష్టప్ప
20. మహుబూబ్ నగర్–బోయ స్వప్న శ్రీనివాసులు
21. దేవరకద్ర–బసిరెడ్డి సంతోష్ రెడ్డి
22. మక్తల్–వర్కటన్ జగన్నాధ్ రెడ్డి
23. అచ్చంపేట్(ఎస్సీ) – మెత్కూరి నాగార్జున
24. కల్వకుర్తి–కొమ్ము శ్రీనివాస్ యాదవ్
25. షాద్నగర్–పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
26. కొల్లాపూర్–గగనం శేఖరయ్య
27. హుజూర్ నగర్– రాపోలు నవీన్
28. మునుగోడు–అందోజు శంకరాచారి
29. ఘన్పూర్ –స్టేషన్ (ఎస్సీ)– తాళ్లపల్లి వెంకటస్వామి
30. పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త
31. డోర్నకల్(ఎస్టీ) –గుగూలోత్ పార్వతీనాయక్
32. నర్సంపేట్– డా.గుండాల మధన్ కుమార్
33. వరంగల్ ఈస్ట్–చిత్రపు పుష్పతలయ
34. వర్థన్పేట్(ఎస్సీ)–డా.వడ్డేపల్లి విజయ్ కుమార్
35. ములుగు(ఎస్టీ)–భూక్యా జంపన్న నాయక్
36. పినపాక(ఎస్టీ)–వజ్జ శ్యామ్
37. మధిర(ఎస్సీ)–చెరుకుపల్లి శారద
38. ఆశ్వారావుపేట్(ఎస్టీ)–మడకం ప్రసాద్
39. భద్రాచలం(ఎస్టీ)–ఇర్పా రవి
40. ఇబ్రాహీం పట్నం – మల్లేష్ యాదవ్
41. మహబూబా బాద్ – గుగులోత్ శంకర్ నాయక్
42. శేరిలింగంపల్లి – ఒంగూరి శ్రీనివాస్ యాదవ్
43. వేములవాడ – గోలి మోహన్