Anam Mirza: ‘అప్నే లోగాన్’.. హైదరాబాదీ నయా టాక్ షో

ఆనం మీర్జా ఇప్పటికే పలు రంగాల్లో తన ప్రతిభ చాటుకున్నారు. లేబుల్ బజార్, కుక్ ఇట్ యువర్‌సెల్ఫ్, దావత్-ఇ-రంజాన్ వంటి వ్యాపారాల నిర్వహణతో ఆనం సక్సెస్ సాధించారు. తాజాగా తన సొంత మీడియా నిర్వహణా సంస్థ అయిన ‘ఎక్స్‌ట్రా మీడియా’ ప్రాజెక్టులో భాగంగా కొత్త షోను ప్రారంభించబోతుంది.

Anam Mirza: ‘అప్నే లోగాన్’.. హైదరాబాదీ నయా టాక్ షో

Anam Mirza

Anam Mirza: హైదరాబాద్ మహా నగరం భిన్నమైన సంస్కృతి, జీవన విధానానికి ప్రతీక. అలాంటి హైదరాబాద్ గురించి, ఇక్కడి ప్రజల గురించి చెప్పే సరికొత్త టాక్ షో రాబోతుంది. ‘అప్నే లోగాన్’ పేరుతో రానున్న ఈ టాక్ షో రూపొందిస్తుంది ఆనం మీర్జా. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఈమె.

Tata Technologies: 18 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓ

ఆనం మీర్జా ఇప్పటికే పలు రంగాల్లో తన ప్రతిభ చాటుకున్నారు. లేబుల్ బజార్, కుక్ ఇట్ యువర్‌సెల్ఫ్, దావత్-ఇ-రంజాన్ వంటి వ్యాపారాల నిర్వహణతో ఆనం సక్సెస్ సాధించారు. తాజాగా తన సొంత మీడియా నిర్వహణా సంస్థ అయిన ‘ఎక్స్‌ట్రా మీడియా’ ప్రాజెక్టులో భాగంగా కొత్త షోను ప్రారంభించబోతుంది. అదే ‘అప్నే లోగాన్’. తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ షో ప్రారంభమవుతుంది. దీని గురించి ఆనం మీర్జా మాట్లాడుతూ ‘‘అప్నే లోగాన్ అంటే మన ప్రజలు అని అర్థం. మనకు ఎంతగానో తెలిసిన హైదరాబాద్ ప్రముఖులు ఈ షోలో పాల్గొంటారు.

Sai Pallavi : వేరే హీరోయిన్ ఈ సినిమాని నాకు ఇచ్చింది.. నటిగా నిరూపించుకోవడానికే ఇలాంటి పాత్రలు..

ఇది ప్రారంభం మత్రమే. మన దగ్గర చాలా మంచి వాళ్లున్నారు. చాలా చాలా మంచి వాళ్లు. అందరినీ షోలో చూస్తారు. మీరు ఈ షోను ఎంతగానో ఇష్టపడతారు’’ అని చెప్పింది. త్వరలో ఆనం మీర్జా యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆమె విడుదల చేసింది.