Viral Video: 50 ఏళ్ల వయసులో హుషారుగా దంపతుల డ్యాన్స్

పెళ్లి వేడుకల్లో యువత డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. మధ్య వయసువారు డ్యాన్స్ చేసినా చేతులు కదిలించడం తప్ప ఏమీ చేయలేరని మనం అనుకుంటాం. అయితే, తాజాగా ఓ పెళ్లి వేడుకలో 50 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: 50 ఏళ్ల వయసులో హుషారుగా దంపతుల డ్యాన్స్

Viral Video

Viral Video: పెళ్లి వేడుకల్లో యువత డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. మధ్య వయసువారు డ్యాన్స్ చేసినా చేతులు కదిలించడం తప్ప ఏమీ చేయలేరని మనం అనుకుంటాం. అయితే, తాజాగా ఓ పెళ్లి వేడుకలో 50 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిషా డేవిస్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. మళయాల పాట ‘ముంతిరి పదం’కు ఆ దంపతులు వేదికపై డ్యాన్స్ చేశారు. పాటను చాలా ఎంజాయ్ చేస్తూ ఆ దంపతులు వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. వారి హావభావాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది దీన్ని చూశారు. ఈ వయసులోనూ ఆ దంపతుల ఉత్సాహం చూస్తుంటే వారు ఇంకా యువతగానే ఉన్నట్లు అనిపిస్తోందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. పెళ్లి వేడుకలో వధూవరులకు ఈ దంపతులు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారని కొందరు అన్నారు. కొన్నేళ్ల క్రితం 50 ఏళ్ల ఓ వ్యక్తి ఇలాగే డ్యాన్స్ చేసి ‘డ్యాన్సింగ్ అంకుల్’గా పేరు తెచ్చుకున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Jisha Davis (@jis__ha)

Union Minister Jaishankar: 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్