Idol vandalised: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి.. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేసి..

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లోని జెనైదాలోని కాళీ మాత ఆలయంలో దుండగులు దాడికి పాల్పడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేశారని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, దుండగులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు గుడిలోకి ప్రవేశించారని, విగ్రహాన్ని ముక్కలు చేసి, దాని తలను గుడికి అర కిలోమీటరు దూరంలో రోడ్డుపై పడేశారని చెప్పారు. 10 రోజుల దుర్గా పూజా వేడుకలు ముగిసిన మరుసటి రోజే ఆ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Idol vandalised: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి.. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేసి..

Idol vandalised: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లోని జెనైదాలోని కాళీ మాత ఆలయంలో దుండగులు దాడికి పాల్పడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేశారని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, దుండగులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి సమయంలో దుండగులు గుడిలోకి ప్రవేశించారని, విగ్రహాన్ని ముక్కలు చేసి, దాని తలను గుడికి అర కిలోమీటరు దూరంలో రోడ్డుపై పడేశారని చెప్పారు. 10 రోజుల దుర్గా పూజా వేడుకలు ముగిసిన మరుసటి రోజే ఆ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్ లో మందిరాలపై దాడులు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

ఈ ఏడాది మార్చి 17న ఢాకాలోని ఇస్కాన్ లోని రాధాకాంత జీవ్ మందిరంలోని దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతేకాదు, మందిరంలోని భక్తులపై కూడా దాడి చేశారు. దాదాపు 200 మంది అతివాదులు మందిరం వద్దకు దూసుకు వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారని ఇస్కాన్ మందిరం తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..