UK : దేశంలోనే రికార్డు సృష్టించిన శిశువు..అమ్మకు 17 ఏళ్లే

.17 సంవత్సరాలున్న యువతి..నెలలు నిండని పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు కేవలం 325 గ్రాముల బరువు ఉంది. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యం అంత బాగాలేదని తెలుస్తోంది...

UK : దేశంలోనే రికార్డు సృష్టించిన శిశువు..అమ్మకు 17 ఏళ్లే

Uk

Just Born Baby Record : Ellie Paton…17 సంవత్సరాలున్న యువతి..నెలలు నిండని పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు కేవలం 325 గ్రాముల బరువు ఉంది. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యం అంత బాగాలేదని తెలుస్తోంది. చనిపోయే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. గత 20 సంవత్సరాల్లో యూకేలో జన్మించిన అత్యంత తక్కువ బరువున్న శిశువుగా రికార్డుకెక్కింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

Read More : Covid -19 : ఐఐటీ హైదరాబాద్‌‌లో కరోనా కలకలం..

ఎల్లీ, బ్రాండన్ స్టిబుల్స్ భాగస్వాములు. ఎల్లీ గర్భవతి అని తేలడంతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ స్కానింగ్ చేయగా…16 వారాల పిండం పరిమాణంలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విపరీతమైన కడుపు..నడుం నొప్పితో బాధ పడుతుండడంతో ఎల్లీని డిసెంబర్ 29వ తేడదీన ఐర్ షైర్ కిల్ మార్నాక్ లోని క్రాస్ హౌస్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డిసెంబర్ 30వ తేదీన జన్మనిచ్చింది. ఏప్రిల్ 13న డెలివరీ కావాల్సి ఉంది. తక్కువ బరువుతో ఉన్న పసికిందు ఎక్కువ రోజులు బతకదని తేల్చారు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. శిశువు జీవించి ఉండడం అరుదుగా జరుగుతుందని వెల్లడిస్తున్నారు.