WoW‘eBaby’ : వీర్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి..బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌..!!

బిడ్డను కనాలంటే ఒప్పటిలా ఆడా-మగా ఉండాల్సిన పనిలేదు. జస్ట్ ‘ఆన్ లైన్ లో వీర్యం’ ఆర్డర్ చేసి బిడ్డను కనేయొచ్చు. అదే నయా ట్రెండ్..

WoW‘eBaby’ : వీర్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి..బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌..!!

Woman Gives Birth To ‘ebaby’ 

Woman Gives Birth to ‘eBaby’  :ఆన్ లైన్ వ్యాపారం. నెట్టింట్లో ఆర్డర్ చేసి నట్టింట్లో కూర్చుంటే అన్ని కాళ్ల దగ్గరకే వచ్చి పడుతున్నాయి. తినే ఆహారం నుంచి కట్టుకునే బట్టల వరకు..ఫినాయిల్ బాటిల్ నుంచి షాంపియన్ బాటిల్ వరకూ అంతా ఆన్ లైన్ లోనే. అంతగా ఆన్ లైన్ జనాలకు అలవాటైపోయింది. ఇప్పుడంతా వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచంలో బ‌తుకుతోంది.ఈ ఆన్ లైన్ ఎంత వరకు వెళ్లిందంటే..ఏకంగా బిడ్డల్ని కనటానికి కూడా ఆన్ లైన్ లోనే జరిగిపోయేంతగా మారిపోయింది. ఏంటీ ఆన్ లైన్ లో బిడ్డల్ని కనటమా?మరీ విడ్డూరం కాకపోతే..అనుకోవచ్చు. వినటానికి ఇది వింతగా..విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..ఎలాగంటే..ఏదో కాఫ్ సిరఫ్ ఆర్డర్ ఇచ్చినట్లుగా ఓ మహిళ ఏకంగా ‘వీర్యం’ ఆర్డర్ చేసింది.

Read more : ‘Chicken Parenting’ : చైనాలో కొత్త ట్రెండ్..పిల్ల‌ల‌కు చికెన్ రక్తం ఇంజెక్ష‌న్స్ చేయిస్తున్న పేరెంట్స్

ఓ మహిళ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాలంటే మగతోడు కావాల్సిందే. కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజీ పుణ్యమాని ఇదేమీ అవసరం లేకుండానే మగాడు లేకుండానే బిడ్డల్ని కనేస్తున్నారు అతివలు.వామ్మో..టెక్నాలజీ అంటే ఇదేనా అనిపిస్తున్నారు.

మరి ఇదెలా సాధ్యం అంటారా? ఓ మహిళ బిడ్డను కనాలని అనుకుంది. దానికోసం వీర్యాన్ని ఆన్ లైన్ లో ఆర్డ్ చేసి బిడ్డను కనేసింది. ఆర్టిఫిషియ‌ల్ ఇన్‌సెమినేష‌న్ ద్వారా బిడ్డను కన్నది.దీన్నే కృత్రిమ గ‌ర్భదార‌ణ అంటారు. మ‌గాళ్ల వీర్యాన్ని ఆన్‌లైన్‌లో అమ్మే రోజుల్లో ఉన్నాం మ‌నం ఇప్పుడు. డెవలప్ మెంట్ అంటే ఇదేనా అనిపించేలా వీర్యాన్ని కూడా ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారు. అలా ఆన్ లైన్ లో కాఫ్ సిరఫ్ ఆర్డర్ చేసినట్లుగా వీర్యాన్ని ఆర్డర్ లో తెప్పించుకుని..ఇన్‌సెమినేష‌న్ ప్ర‌క్రియ ద్వారా ఏకంగా బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది.

Read more : ‘Chicken Parenting’ : చైనాలో కొత్త ట్రెండ్..పిల్ల‌ల‌కు చికెన్ రక్తం ఇంజెక్ష‌న్స్ చేయిస్తున్న పేరెంట్స్

ఇంగ్లండ్‌లోని నార్త్ యోర్క్‌షైర్‌కు చెందిన 33 ఏళ్ల స్టెఫెనీ టేల‌ర్ అనే మహిళకు ఓ పిల్లాడు ఉన్నాడు. వాడికి 5 ఏళ్లు. వాడి పేరు ఫ్రాంకీ. రెండో బిడ్డను కనాలని అనుకుంది. కానీ ఫ్రాంకీ పుట్టిన కొంతకాలానికే స్టెఫెనీ భర్తతో విడిపోయింది. కానీ ఫ్రాంకీకి తోడుగా మరో బిడ్డ ఉండే బాగుండు అనుకుంది. అందుకే రెండో బిడ్డను కనటానికి స్టెఫెనీ . ఆమె మొదట సరిఅయిన యాదృచ్ఛిక స్పెర్మ్ డోనర్ కోసం జస్ట్ ఎ బేబీ యాప్‌లో సెర్చ్ చేసి..వీర్యాన్ని ఆర్డ‌ర్ చేసి.. రెండో బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది.

వీర్యంతో పాటు.. ఇన్‌సెమినేష‌న్ కిట్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇచ్చింది. దాంతో ఎలా గర్భం ధరించాలో యూట్యూబ్‌లో చూసి తెలుసుకుంది. అలా వీడియోలో చూసి ఆర్డర్ చేసి కొన్ని ఆ వీర్యాన్ని త‌న అండంలోకి ప్ర‌వేశ‌పెట్టింది టేల‌ర్‌. ఇన్‌సెమినేష‌న్ చేసుకున్న రెండు వారాల త‌ర్వాత త‌ను గ‌ర్భం దాల్చింది. అలా 9 నెల‌ల త‌ర్వాత పండంటి ఓ ఆడపిల్లలకు జ‌న్మ‌నిచ్చింది స్టెఫెనీ. ఆ పాపకు ఈడెన్ అనే పేరు పెట్టింది.

త‌న‌కు వీర్యం ఇచ్చిన దాత‌ను.. ఈడెన్ భ‌విష్య‌త్తులో క‌ల‌వాల‌నుకున్నా త‌నకు ఎటువంటి స‌మ‌స్య లేద‌ని కూడా స్టెఫెనీ చెప్పింది. అయితే.. త‌నకు వీర్యం దానం చేసిన వ్య‌క్తి వివ‌రాల‌ను మాత్రం టేల‌ర్ బయటపెట్టలేదు.

మరి ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యాక తండ్రి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే..దానికి కూడా అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఏ లేటెస్ట్ టెక్నాలజీతో తల్లి తనను కన్నదో ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యేసరికి టెక్నాలజీ మరింత డెవలప్ అవుతుంది. కాబట్టి తండ్రి ఎవరో తెలుసుకోవాలనున్నా ఆ బిడ్డకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ టెక్నాలజీ వరల్డ్. ట్రై చేస్తే ఏదైనా సాధ్యమే.

ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మానవుడి వరకు మనిషి తన తెలివితోనే ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. ఎంతగా అంటే బిడ్డను కనాలంటే వీర్యాన్ని ఆర్డర్ చేసి బిడ్డనుకనేంత టెక్నాలజీని డెవలప్ చేసేదాకా..!!