viral video:అమ్మను మించిన అందం ఏముంది? 60 ఏళ్ల తల్లితో యాడ్ చేసిన డిజైనర్..సూపర్ సక్సెస్

60 ఏళ్ల తల్లితో తన ఫ్యాషన్ బ్రాండ్ కోసం యాడ్ చేసాడు ఓ డిజైనర్..అంతే అత్యద్భుతమైన అవుట్ పుట్ రావటంతో అతని టాలెంట్ మారుమ్రోగిపోతోంది. మోడల్ గా అమ్మ అంటూ ప్రశంసిస్తున్నారు.

viral video:అమ్మను మించిన అందం ఏముంది? 60 ఏళ్ల తల్లితో యాడ్ చేసిన డిజైనర్..సూపర్ సక్సెస్

60 Year Mom Model Did Ad For His Designer

60 year mom model did ad for his designer sons fashion brand : ఫ్యాషన్ బ్రాండ్ అయినా మరోటైనా పబ్లిసిటీ ముఖ్యం. ఈ పోటీ ప్రపంచంలో గుర్తింపు పొందాలంటే ‘యాడ్’ ప్రధానం. అదే ఆయుధం. ఎంత పెద్ద బ్రాండ్ అయినా..యాడ్ తోనే జనాల్లోకి వెళ్లేది. అలా యాడ్ చేయాలంటే పేరున్న మోడల్ కావాలి. ఆ మోడల్ అందంగా..ఆకట్టుకునేలా ఉండాలి. అందాల భామలు ఉండాలి. కానీ..ఓ డిజైనర్ మాత్రం తన ఫ్యాషన్ సంస్థ కోసం అందాల భామలకు బదులుగా తన ‘‘60 ఏళ్ల వయస్సున్న కన్నతల్లినే మోడల్’’ గా చూపిస్తు యాడ్ డిజైన్ చేశాడు. ఇది కనీవినీ ఎరుగని ఆలోచన.. ఈ ఊహించని అతని ఊహకు అందనంతగా ఔట్‌పుట్ అదిరిపోయింది. ఈ యాడ్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఏంటీ అమ్మతో యాడా? అని అందరు షాక్ అయ్యేంతగా ఈ యాడ్ అవుట్ పుట్ అద్దిరిపోయింది…!

ఫ్యాషన్ డిజైనర్ ట్రావిస్ డిమీర్‌కు IEMBE అనే ఫ్యాషన్ సంస్థ ఉంది. తన ఫ్యాషన్ బ్రాండ్ కోసం ఓ 20 ఏళ్ల వయసున్న మోడల్ ఎవరైనా దొరికితే బాగుండని వెతికాడు. కానీ ఏ మోడలూ…అతని యాడ్ లో నటించటానికి ఒప్పుకోలేదు.నీకు యాడ్ చేస్తే మాకు కలిసొచ్చేదేంటీ..నీకు పేరుందా? ఏంటీ అంటూ మొహమ్మీదే అనేసారు. కానీ డిమీర్ కు మాత్రం ఏదో సాధించాలనే కసి ఉంది. కానీ మోడల్స్ తనతో యాడ్ చేయటానికి అంగీకరించకపోవటం తీవ్రంగా అప్ సెట్ అయ్యాడు. కానీ ఏదో చేసి తన టాలెంట్ నిరూపించుకోవాలని తపన పడ్డాడు. ఏదో ఒకటి చేయాలి..చేసి తీరాలి..అనే పట్టుదల పెంచుకున్నాడు. ప్రతీ క్షణం అదే తపన, అదే ఆలోచన.. ఎవరితో చెయ్యాలి? ఎవరితో చెయ్యాలి? ఎవరు? ఎవరు? అని తల బద్ధలు కొట్టుకున్నాడు. మరోవైపు మోడల్స్ కోసం వేట..

ఇంట్లో కూర్చుని నిరంతరం అవే ఆలోచనలతో తల పగిలిపోయేది.అలా ఓ రోజు తల్లి కొడుకు బాధను అర్థం చేసుకుంది. ‘‘నువ్వు ఏదోకటి చేస్తావు నాన్నా..నాకు నీమీద నమ్మకం ఉంది..నీకంటూ ఓ మంచి రోజు వస్తుంది..’’అంటూ ఉత్సాహపరిచింది. అలా చెబుతున్న తల్లి వంక చూసిన డిమీర్ కు ఓ మెరుపులాంటి ఆలోచన. తన తల్లితోనే యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించాడు. ఆ ఆలోచనే అద్భుతం అనుకుంటే ఐట్‌పుట్ అదుర్స్ తో మరో అత్యద్భుతం..!!

ఫ్యాషన్ డిజైనర్ల పని అంతా క్రియేటివిటీయే. తమ బ్రాండ్‌కి తగిన మోడల్ లేకపోతే… ఆ బ్రాండ్ ప్రజల్లోకి వెళ్లదు. అందుకే ది బెస్ట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సరైన మోడల్ తగిలితే… ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు అని డిజైనర్లు అనుకుంటూ ఉంటారు. ట్రావిస్ తన ఆలోచనను తల్లితో చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఇదేంటిరా? నాకు 60 ఏళ్లు..నేను మోడల్ ని ఏంటీ? అని అంది. కానీ కొడుకు ‘‘అమ్మా అమ్మను మించిన అందం ఉంటుందా? నాకు ఇన్నాళ్లు ఆ ఆలోచనే రాలేదు..అంటూ అమ్మను ఒప్పించటానికి ఎన్నో చెప్పాడు. కానీ అమ్మ కదా..కొడుకు కోసం ఏమైనా చేయగలదు. కానీ ఓ పక్క కొడుకు టాలెంట్ మీద నమ్మకం..మరో పక్క ఏమవుతుందోననే సందేహంతో “నేను చేయగలనా” అని ఆలోచించింది. “నాకు ఇవేవీ తెలియనే తెలియవురా నాన్నా..నా వల్ల అవుతుందా” అని అడిగింది..దానికి కొడుకు ఉత్సాహంగా..”డోంట్ వర్రీ..మామ్..అంతా నేను చూసుకుంటానుగా… నేను చెప్పినట్లు చెయ్యి మామ్” అని ఆమెను ఎంకరేజ్ చేశాడు. ఫొటోషూట్ చేశాడు.

ఓ సాధారణ తల్లిని స్టన్నింగ్ ప్రొఫెషనల్ మోడల్‌లా మార్చేశాడు. అతని యాడ్ చూసిన వాళ్లు… ‘‘వాటే థింకింగ్..వాటే ఎక్సలెంట్ టాలెంట్’ అంటు తెగ ఊదరగొట్టేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆ యాడ్ వీడియో దుమ్మురేపేస్తోంది. షేక్ చేసేస్తోంది. తల్లి 60 ఏళ్ల మహిళలా కాకుండా… 20 ఏళ్ల యువతిలా కనిపిస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె కోసం అతను చేసిన ఔట్‌ఫిట్ అదిరిపోయింది అంటున్నారు.

ఇక్కడ ట్రావిస్ ఎంత తపించాడో… అతని తల్లి కూడా అంతే సపోర్ట్ ఇచ్చింది. తన కొడుకు బ్రాండ్‌ని నిలబెట్టేందుకు ఆమె తన శక్తినంతా ధారపోసింది. ఆ వయసులో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా… ఫుల్ కాన్ఫిడెన్స్‌తో యాడ్ చేసింది. ప్రొఫెషనల్స్ మోడల్స్ సైతం అవాకయ్యేలా యాక్ట్ చేసింది. ఏమాత్రం అనుభవం లేకపోయినా… ఆరితేరిన మోడల్‌లా ఆమె చెయ్యడంతో… అందరి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఫ్యాషన్ ప్రపంచంలో అందానికే ప్రాధాన్యం ఉంటుంది. ఏజ్ పెరిగిన మోడల్స్‌ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి ఈ రోజుల్లో ట్రావిస్… తన తల్లితో చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మీకూ ఈ యాడ్ నచ్చిందా! అంతే మరి అమ్మను మించిన అందం ఈ లోకం ఇంకేముంటుంది?