Russia Ukraine War : రష్యా దాడిలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు, 10 మందికిపైగా సామాన్య పౌరులు మృతి

రష్యా దాడులను యుక్రెయిన్ తిప్పికొడుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తామంటూ యుక్రెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తోంది.

Russia Ukraine War : రష్యా దాడిలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు, 10 మందికిపైగా సామాన్య పౌరులు మృతి

War

40 Ukrainian soldiers killed : ఉక్రెయిన్ పై రష్యా బాంబుల దాడిని మరింత తీవ్రం చేసింది. ఉక్రెయిన్ లోని అన్ని నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. ప్రధాన పట్టణాలను టార్గెట్ చేసుకుని రష్యా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తోన్నాయి. రష్యా దాడిలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లుగా యుక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సైనికులతోపాటు మరో పది మందికిపైగా సామాన్య పౌరులు చనిపోయినట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహా దారు ఒలెస్కీ అరస్టో విజ్ ప్రకటించారు. రెండు ఎయిర్ పోర్టులను రష్యా సైన్యం ధ్వంసం చేసింది.

ఇక రష్యా దాడులను యుక్రెయిన్ తిప్పికొడుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తామంటూ యుక్రెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తోంది. మొత్తం 7 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. కాసేపటి క్రితం మరో యుద్ధ విమానాన్ని నేల కూల్చామని ప్రకటించింది. మొత్తం 10 రష్యా యుద్ధ విమానాలను కూల్చినట్లు పేర్కొన్నారు. యుక్రెయిన్ భూభాగంలోకి చొరబడ్డ 50 మంది రష్యా సైనికులను తుదముట్టించామని యుక్రెయిన్ చెబుతోంది.

Indian Markets : రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంతో కుప్పకూలిన భారత మార్కెట్లు

మరోవైపు సామాన్య పౌరులను రష్యా టార్గెట్ చేస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని అంటుంది. అయితే రష్యా మాత్రం కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని చెబుతోంది. అటు తమపై దాడులు మొదలు పెట్టిన రష్యాపై యుక్రెయిన్ అధ్యక్షుడు జలాన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రష్యాతో అన్ని దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లుగా ప్రకటించారు.