Jill Biden Lip kiss : కమలాహ్యారిస్ భర్తకు ‘లిప్‌కిస్’ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు భార్య జిల్ బైడెన్..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ భర్తకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ ‘లిప్ కిస్’ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jill Biden ‘Lip Kisses’ Kamala Harris's Husband
Jill Biden Lip kiss : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ భర్తకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ ‘లిప్ కిస్’ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరాయివారిని కూడా ముద్దు పెట్టుకోవటం అనేది అమెరికాలో సర్వసాధారమే అయినా అమెరికా ఉపాధ్యక్షురాలు భర్తకు అధ్యక్షుడు భార్య కిస్ ఇవ్వటం పైగా ‘లిప్ కిస్’ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. క్యాపిట్ హిల్‌లో జరిగిన సమావేశం ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈ సమావేశం సందర్భంగా అక్కడికి వచ్చిన జిల్ బైడెన్.. అక్కడే ఉన్న కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్ ను ముద్దు పెట్టుకున్నారు. ఇద్దరి పెదవులు కొన్ని క్షణాలు లాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికన్ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘జిల్ బైడెన్ కమలా హ్యారిస్ భర్తను లిప్స్‌పై ముద్దు పెట్టుకున్నారా..?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉభయసభలను ఉద్దేశించి 75 నిమిషాలు ప్రసంగించారు. స్టేట్ ఆఫ్ ద యూనియన్‌లో బైడెన్ ప్రసంగించడం ఇది రెండోసారి. బైడెన్ తన ప్రసంగంలో చైనాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో గన్ కల్చర్,యూఎస్ ఆర్థిక వ్యవస్థ,యుక్రెయిన్ యుద్ధంతో పాటు చైనా బెలూన్, సోషల్ మీడియా వంటి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా బైడెన్ అమెరికా ఆర్థిక వ్యవస్థను పునర్మించటం, దేశాన్ని ఏకం చేయడానికి డెమెక్రాట్లు, రిపబ్లికన్లు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒకవేళ తమ సార్వభౌమత్వానికి చైనా నుంచి ప్రమాదం తలెత్తితే దేశాన్ని రక్షించుకునేందుకు సరైన రీతిలో స్పందిస్తామని ..దానికి తగిన చర్యలు తీసుకుంటామని బైడెన్ తెలిపారు.
Jill Biden kissed Kamala Harris’s right on the lips. #sotu2023 #StateOfTheUnionAddress pic.twitter.com/NT9KtVdsE0
— Terrence K. Williams (@w_terrence) February 8, 2023