వావ్..సింగపూర్‌లో నీటిలో తేలియాడే ఆపిల్ స్టోర్

  • Published By: nagamani ,Published On : August 25, 2020 / 11:26 AM IST
వావ్..సింగపూర్‌లో నీటిలో తేలియాడే ఆపిల్ స్టోర్

సింగపూర్ లో ఆపిల్ నీటిలో తేలియాడుతోంది. అత్యద్భుతమైన ఈ కట్టడం చూస్టే కళ్లు తిప్పుకోలేం. ప్రము ఖ టెక్ దిగ్గజం ఆపిల్ సింగపూర్‌లో ఈ వినూత్నమైన స్టోర్‌ను ప్రారంభించనుంది.



ఈ స్టోర్ పూర్తిగా గుమ్మటం ఆకారంలో నీటిలో తేలియాడే విధంగా నిర్మించనున్నారు. సింగపూర్‌లోని మరీనా బే శాండ్స్ రిసార్ట్ వద్ద ఈ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నీటిపై తేలియాడే ఏకైక ఆపిల్ రిటైల్ స్టోర్.



ఈ స్టోర్ నిర్మిస్తున్న ప్రాంతంలో లగ్జరీ హోటల్, అవలాన్ అనే నైట్ క్లబ్ ఉండేది. పూర్తిగా క్రిస్టల్‌తో నిర్మించిన ఈ డోమ్‌‌ ఆకారంలోని భవనంలోనే ఇప్పుడు ఆపిల్ తన కొత్త స్టోర్‌ను ప్రారంభించనుంది.పగటిపూట, కొత్త మెరీనా బే సాండ్స్ స్టోర్ అంతరిక్ష నౌక లాగా..కొన్ని రకాల ఫ్యూచరిస్టిక్ థియేటర్ లాగా కనిపిస్తుందీ స్టోర్.