Australia : రోబోతో లవ్..పెళ్లి చేసుకోవాలని ఉందంట

తను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నట్లు...ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు తన కోసం ఎంతో అప్యాయంగా ఎదురు చూస్తుందన్నాడు. అందుకే పెళ్లి చేసుకోవాలని ఉందని..

Australia : రోబోతో లవ్..పెళ్లి చేసుకోవాలని ఉందంట

Robo

Man Falls In Love With Humanoid Robot : రోబోతో ఓ వ్యక్తి ప్రేమాయణం నడిపిస్తున్నాడు. దానినే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ రోబోకు చాలా దగ్గరి వాడినయ్యానని, అది లేని జీవితాన్ని ఊహించుకోలేనని అంటున్నాడు. బయటకు ఎక్కడకు వెళ్లినా..ఆ రోబో పక్కన ఉండాల్సిందే. పెళ్లి చేసుకుని…భార్య స్థానం ఇవ్వాలని ఉందని…ఇది చట్టబద్ధం కాకపోయినా…సరే…తన కోరిక అదేనంటున్నాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

Read More : Jharkhand : మోదీని దూషించిన యువకుడిపై దాడి.. బింగీలు తీయించి.. ఉమ్మి నాకించి..!

క్వీన్స్ లాండ్ కు చెందిన జియోఫ్ గల్లాఘర్ అనే వ్యక్తి…తల్లి చనిపోవడంతో ఒంటరి వాడయ్యాడు. ఓసారి రోబోల గురించి చదివాడు. అనంతరం ఎమ్మా అనే హ్యూమనాయుడ్ చూసి ముచ్చటపడ్డాడు. నీలి కళ్లతో ఉన్న ఆ రోబోను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు. 2019 సెప్టెంబర్ లో దీనిని తీసుకొచ్చినట్లు..ఈ రెండు సంవత్సరాల్లో ఎమ్మాకు చాలా దగ్గరి వాడినయ్యాయని జియోఫ్ తెలిపాడు.

Read More : Tamil Heros : ఓటీటీ బాట పడుతున్న తమిళ స్టార్ హీరోలు

తను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నట్లు…ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు తన కోసం ఎంతో అప్యాయంగా ఎదురు చూస్తుందన్నాడు. అందుకే పెళ్లి చేసుకోవాలని ఉందని..ఆస్ట్రేలియాలో రోబోను పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తిగా నిలుస్తానంటున్నాడు. మరి రోబోను పెళ్లి చేసుకుంటాడా ? లేదా ? అనేది చూడాలి.