Alien abduction: ఏలియన్స్ నన్ను 50సార్లు కిడ్నాప్ చేశారు..

నేను చన్నప్పటి నుంచి నన్ను ఏలియన్స్ ఎత్తుకెళుతున్నారు. అలా ఇప్పటి వరకూ 50 సార్లు పైనే నన్ను ఎత్తుకెళ్లారు అని చెబుతోంది బ్రిటన్ కు చెందిన 50 ఏళ్ల మహిళ.

Alien abduction: ఏలియన్స్ నన్ను 50సార్లు కిడ్నాప్ చేశారు..

British Woman Alien Abduction (3)

British Woman Alien abduction : నన్ను ఏలియన్స్ ఎత్తుకెళ్లారు..అలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు 52 సార్లు నన్ను ఏలియన్స్ ఎత్తుకెళ్లాంటూ బ్రిటన్ కు చెందిన ఓ మహిళ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) భూగ్రహం మీద నివసించే మనుష్యుల్ని ఎత్తుకుపోయారని తరువాత వాళ్లను తిరిగి భూమ్మీద వదిలేశారనే వార్తలు వింటుంటాం. అసలు ఏలియన్స్ ఉన్నారా? ఇవన్నీ నిజమేనా? అని కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చ. కానీ వీటిపై చర్చలు..ఓ కొలిక్కి రావటంలేదు. కానీ కొంతమంది మాత్రం తమకు ఏలియన్స్ ఎత్తుకుపోయారని అనటం మాత్రం కొనసాగుతోంది. కానీ బ్రిటన్ కు చెందిన ఓమహిళ తనను ఏలియన్స్ ఎన్నోసార్లు ఎత్తుకుపోయారని అలా 50సార్లు ఎత్తుకుపోయారని ప్రకటించటం మరో సంచలనానికి దారి తీసింది.



గ్రహాంతరవాసులు ఎగిరే పళ్లాలలో వచ్చి..మనుషుల్ని ఎత్తుకుపోయారని వార్తలు ఎక్కువగా విదేశాల నుంచి వింటుంటాం. కొన్ని సందర్భాల్లో తమ పశువుల్ని ముఖ్యంగా ఆవుల్ని ఎత్తుకుపోతారని ముఖ్యంగా అమెరికా వాసులు బాగా నమ్ముతుంటారు. ఇదే ఈ టాపిక్ పై పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈక్రమంలో బ్రిటన్‌ లోని వెస్ట్ యార్క్‌షైర్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌కు చెందిన పౌలా స్మిత్ అనే 50 ఏళ్ల మహిళ తనను ఏలియన్స్ 50 సార్లకు పైగా ఎత్తుకెళ్లారని చెబుతోంది. దాంతో… ఆమె నిజం చెబుతోందా? లేదా పబ్లిసిటీ కోసం డ్రామాలాడుతోందా? అనే డౌట్ వచ్చింది. ఒకసారి రెండు సార్లు అంటే నమ్మొచ్చేమో గానీ ఈమె మరీ 50సార్లకు పైగా అంటుంటే..నమ్మటం కష్టమేనంటున్నారు చాలామంది.



అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతోంది ఎప్పటికప్పుడు. ముఖ్యంగా ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు. ఏలియన్స్ ఎగిరే పళ్లాలలో వస్తున్నారా? అనేది మరో ప్రశ్న. వారు మనుషుల్ని ఎత్తుకెళ్తున్నారా అనేది ఇంకో ప్రశ్న. వీటికి వేటికీ ఆధారాలు లేవు. కాని కొంతమంది మాత్రం ఇది నిజమే మేం ఆకాశంలో వింత వస్తువుల్ని (UFO)లను చూశాం అని చెబుతుంటారు. కావాలంటే వీడియోలు చూడండీ అంటారు. కానీ ఈ వీడియోల్లో ఏదీ స్పష్టంగా ఉండవు. దీంతో అసలు ఏలియిన్స్ ఉన్నారా? ఉంటే నిజంగా భూమ్మీదకు వచ్చి మనుష్యుల్ని..జంతువుల్ని ఎత్తుకుపోతున్నారా? ఎత్తుకుపోతే..మనుష్యుల్ని తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చి వదిలేస్తున్నారా?ఇవన్నీ నిజాలేనా? అనేది మాత్రం క్లారిటీ లేకుండాపోతోంది.



తనను ఏలియన్స్ ఎత్తుకెళ్లిన విషయంపై..పౌలా స్మిత్ మాట్లాడుతూ..నేను చిన్నప్పుడు మొదటిసారి ఏలియన్స్ ఎత్తుకెళ్లారనీ..ఆ తర్వాత నుంచి అలా ఎత్తుకెళ్తూనే ఉన్నారని చెప్పింది. ఇలా ఎత్తుకెళ్లినప్పుడల్లా…తన ఒంటిపై గాయాలు పెడుతున్నారని చెబుతూ తన శరీరంమీద గాయాల మచ్చల్ని చూపిస్తోంది. ఏలియన్స్ సిల్వర్ కలర్ లో ఉన్నారని చెబుతూ..కొన్ని ఫొటోలు కూడా చూపించింది. ఆ ఫోటోల్లో చిత్రమైన జీవులున్నాయి. అవే ఏలియన్స్ అని పౌలా చెబుతోంది. ఆ ఫొటోలు స్పేస్‌షిప్ లో తీసినవే నంటోంది.



అలా నన్ను 52 సార్లు ఎత్తుకెళ్లారు.కానీ ఎటువంటి వార్నింగ్‌లూ ఇవ్వలేదు. “నేను ఏలియన్స్ ఎత్తుకెళ్లేటప్పుడు UFOలో ఉన్నా… నాకు అలా అనిపించదని చెబుతోంది. నన్ను మొదటిసారి రెండో సారి ఎత్తుకెళ్లినప్పుడు భయపడేదాన్ని. కానీ అలా పదే పదే ఎత్తుకెళుతుంటే భయం పోయింది..భయపడటం మానేసి… ఎంజాయ్ చేసేదాన్ని అని అని చెబోతంది. అంతే కాదు… తన చుట్టూ ఉన్న ప్రజలు మంచి వాళ్లు కాదనీ..నేను చెప్పే మాటల్ని ఎవ్వరూ నమ్మట్లేదని చెప్పుకొస్తోంది. ఏంటీ మీరు నమ్ముతున్నారా? అయితే మీ ఇష్టం..