Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు

శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా ఒక పరయోగాత్మక క్యాన్సర్ ఇంజెక్షన్ రూపొందించారు. క్యాన్సర్ మహమ్మారిపై పోరులో భాగంగా శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు తెర తీశారు. క్యాన్సర్ ను అంతం చేసే వైరస్ ను ఇంజెక్షన్ ద్వారా క్యాన్సర్ రోగిలోకి ప్రవేశపెట్టారు.

Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు

First Human Patient Injected With Cancer Killing Virus (1)

First human patient injected with cancer killing virus : క్యాన్సర్ ను అంతం చేయటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లనుంచి కృషి చేస్తున్నారు.క్యాన్సర్ మహమ్మారిని ఖతం చేయటానికి ఎన్నో పరిశోధనలు చేశారు.చేస్తున్నారు. కానీ క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తునే ఉంది. ఈక్రమంలో శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా ఒక పరయోగాత్మక క్యాన్సర్ ఇంజెక్షన్ రూపొందించారు. క్యాన్సర్ మహమ్మారిపై పోరులో భాగంగా శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు తెర తీశారు. క్యాన్సర్ ను అంతం చేసే వైరస్ ను ఇంజెక్షన్ ద్వారా క్యాన్సర్ రోగిలోకి ప్రవేశపెట్టారు. CF33-hNISని ‘వ్యాక్సీనియా’ అని అంటారు. ఈ ‘వ్యాక్సీనియా’ అనే ఈ వైరస్ ను అమెరికాలో ఓ సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని జంతువులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు.

ఈ వైరస్ కొలన్, లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, పాంక్రియాటిక్ క్యాన్సర్ ట్యూమర్లను తగ్గిస్తున్నట్టు ప్రీ క్లినికల్ లేబరేటరీ, జంతువులపై పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికాలో అతిపెద్ద క్యాన్సర్ పరిశోధన, చికిత్సా సంస్థ ‘సిటీ ఆఫ్ హోప్’ ఆంకాలజిస్ట్.. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డానెంగ్ లి తెలిపారు. ఈ సందర్భంగా డానెంగ్ లి మాట్లాడుతూ..మా గత పరిశోధనలో.. ఆంకోలైటిక్ వైరస్ లు కేన్సర్ ను అంతం చేసేందుకు వీలుగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నట్టు గుర్తించాం అని తెలిపారు. క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న వారికి వ్యాక్సీనియా మంచి ఫలితం ఇస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా వ్యాక్సీనియా ఇంజెక్షన్ ను తక్కువ మోతాదులో నేరుగా క్యాన్సర్ ట్యూమర్లు లేదా నరాల రూపంలో ఇవ్వనున్నట్టు సిటీ ఆఫ్ హోప్ తెలిపింది. వ్యాక్సీనియా అని పిలిచే దీనికి CF33- హెచ్ఎన్ఐఎస్ అని కూడా పేరు. ఇది ఆంకోలైటిక్ వైరస్. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు, క్యాన్సర్ కణాలు ఉంటాయి. క్యాన్సర్ కణాలను గుర్తించి అంతం చేసే విధంగా జన్యుపరంగా మార్పు చేసిన వైరస్ ఇది.

ఈ వైరస్ కణాల్లోకి ప్రవేశించిన తర్వాత తనకు తాను భారీ సంఖ్యలో కొత్త వైరస్ కణాలను తయారు చేసుకుంటుంది. ఇవి యాంటీజెన్ గా పనిచేస్తాయి. ఇవి వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. దాంతో సమీపంలోని క్యాన్సర్ కణాలపై దాడి జరుగుతుంది.