Water gold : నీటిని బంగారంగా మార్చిన సైంటిస్టులు

నీళ్లను బంగారంలా మార్చేస్తే..ఇది సినిమాల్లో అయితే ఓకే.. కానీ నిజంగా జరుగుతుందా?అంటే ‘ ఏ ఎందుకు అవ్వదు? అంటూ.. ప్రయోగాత్మకంగా నీటిని బంగారంలా చేసి చూపించారు సైంటిస్టులు.

10TV Telugu News

Researchers convert water into shiny golden metal : బంగారం అంటే బంగారమే. దాని విలువ ఎప్పటికీ తగ్గేదే లేదు. అలాగే నీరు కూడా బంగారంలా మారిపోయింది. పొదుపుగా వాడుకోవాలి. ఇదిలా ఉంటే ఏకంగా మన జానపద సినిమాల్లో నీళ్లను బంగారంలా మార్చేస్తే..ఇది సినిమాల్లో అయితే ఓకే.. కానీ నిజంగా జరుగుతుందా?అంటే ‘ ఏ ఎందుకు అవ్వదు? అంటూ నీటిని బంగారంలా మార్చి చేసి చూపించాడు సైంటిస్టులు. ఈ విషయం తెలిస్తే..ఎవ్వరూ ఒక్క నీటి చుక్కను కూడా వేస్ట్ చేయరేమో కదూ..నిజమే మరి బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు? కానీ నీటిని బంగారంలా మార్చే ప్రక్రియ అంత ఈజీ కాదు. కానీ ఎలా పడితే అలా చేయటానికి లేదు. దానికంటూ కొన్ని రూల్స్..షరతులున్నాయి, పరిమితులున్నాయి కూడా ఉన్నాయి. అంతంటే మించి దానికి ‘టైమింగ్’ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు.

నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. వాస్తవానికి లోహాలు కాని చాలా వస్తువులను లోహాలుగా మార్చొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, దానికి అమితమైన పీడనం వసరమవుతుందని తెలిపారు. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను ఒకదానిదగ్గరకు మరొకటిని అంటే ఏమాత్రం గ్యాప్ అనేది లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుందని..దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని వివరించారు. నీటి విషయంలోనూ అదే జరుగుతుందని..నీటిని లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని అన్నారు. అయితే, అంత పీడనం లేకుండానే నీటిని లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ అకాడమీ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను అరువుగా తీసుకుని.. నీటిపై ప్రయోగిస్తే అది సాధ్యమవుతుందని తేల్చారు.

పీరియాడిక్ టేబుల్ (రసాయన పట్టిక)లోని గ్రూప్ 1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో సాధ్యమవుతుందని గుర్తించారు. కానీ ఈప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. వాటికి నీటి చుక్క తగిలితే మండే స్వభావం ఉంటుంది. దీంతో పేలుళ్లు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. దానిని అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య రియాక్షన్ అత్యంత నెమ్మదిగా సాగేలా చూసారు. దీంట్లో భాగంగా ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ చాంబర్ లో పెట్టారు.

తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చేశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది. కానీ ఇటువంటి ప్రక్రియ చాలా రిస్క్ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ చర్యలో ఏమాత్రం తేడా జరిగినా పేలుడు సంభవిస్తుందని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, టైమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని తెలిపారు.

10TV Telugu News