నిప్పుకోడితో దుబాయ్ యువరాజు సైకిల్ రేస్..గెలుపెవరిదో తెలుసా?

నిప్పుకోడితో దుబాయ్ యువరాజు సైకిల్ రేస్..గెలుపెవరిదో తెలుసా?

Dubai  prince races ostriches on cycle : నిప్పుకోడితో దుబాయ్ యువరాజుకు పందెం వేసుకున్నారు. భారీగా ఉండే నిప్పుకోడి ఎంత ఫాస్టుగా పరిగెడుతుందో తెలిసిందే. ఈక్రమంలో ఓ నిప్పుకోడితో దుబాయ్ యువరాజు షేక్ హమ్‌దమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ సైకిల్ పందెం వేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. యువరాజు షేక్ హమ్‌దమ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు చేయటంతో అది వైరల్ గా మారింది.

యువరాజు సైక్లింగ్ చేస్తుండగా ఆయనకు రెండు ఆస్ట్రిచ్ (నిప్పుకోళ్లు) పక్షులు తారసపడ్డాయి. ఆయన తన స్టైల్లో సైకిల్ ఫాస్టుగా తొక్కుతుండాగా.. ఆ ఆస్ట్రిచ్‌లు కూడా కాస్త దూరం వెంబడించాయి. దీంతో ఆయన మరింత ఫాస్టుగా సైకిల్ తొక్కారు. ఈ క్రమంలో యువరాజుతో మనకెందుకులే అనుకున్నాయో ఏమోగానీ ఆ నిప్పుకోళ్లు కాస్తంత వెనుకపడ్డాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రిచ్‌తో యువరాజు సైకిల్ రేస్ అంటూ నెటిజన్లు తెగ హడావుడి చేస్తున్నారు. హంగామా చేస్తున్నారు. ఎంతైనా మనస్సున్న యువరాజు కదా..

ఈ రేసులో విజేత ఎవరో అంటూ సరదాగా కామెంట్లు పెట్టారు నెటిజన్లు. మరి కొందరు మాత్రం ప్రమాదం తప్పిపోయిందని పెట్టారు. మరి ఆ ప్రమాదం ఎవరి? అంటే ఆ పక్షులకే అయి ఉంటుంది లెండి. ఎందుకుంటే మరి ఆయన యువరాజు కదా. మరికొందరేమో..యువరాజని వాటికి తెలియదు కదా..పైగా ఆ నిప్పుకోళ్లకు చిర్రెత్తితే మనుషులపై దాడి చేసి గాయపరుస్తాయనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

కాగా..భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షిగా ఆస్ట్రిచ్ ‌పేరుతో వరల్డ్ రికార్డు కూడా ఉందనే విషయం తెలిసిందే. కాగా.. యువరాజు వీడియోకు ఇప్పటివరకూ దాదాపు 4.4 లక్షల వ్యూస్ వచ్చాయి. కాగా…సోషల్ మీడియాలో యువరాజు మఖ్తూమ్‌కు మంచి ఫాలోయింది ఉందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

కొన్ని నెలల క్రితం తన మెర్సిడీజ్ కారుపై ఓ పక్షి గూడు కట్టుకున్న కారణంగా కారును ఆ పక్షులకే ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఇచ్చేయటమంటే ఆ పక్షులు ఆ గూటిలో పెట్టిన గుడ్లు పిల్లలై బయటకెళ్లే వరకూ ఆ కారును ఆయన కదల్చలేదు. సరికదా..ఆ పక్షులకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లుకూడాచేసి ప్రజల ప్రశంసలు పొందారు. అప్పట్లో యువరాజు మెర్సిడీజ్ బెంజ్ కారులో పావురాల గూడు అంటూ నెటిజన్ల మనసు దోచుకుంది. యువరాజుపై ప్రసంశల వర్షం కురిసింది.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3)