Divorce Settlement : రూ.5,500 కోట్ల భరణం.. ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్ ఇదే..!

తన మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు (728 మిలియన్‌ డాలర్లు) రూ. 5వేల 500 కోట్లు విడాకుల భరణంగా ఇ‍వ్వాల్సిందేనని యూకేలోని లండన్‌ హైకోర్టు ఆదేశించింది.

Divorce Settlement : రూ.5,500 కోట్ల భరణం.. ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్ ఇదే..!

Divorce Settlement

Divorce Settlement : దుబాయ్ పాలకుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ (72)ను తన మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు (728 మిలియన్‌ డాలర్లు) రూ. 5వేల 500 కోట్లు విడాకుల భరణంగా ఇ‍వ్వాల్సిందేనని యూకేలోని లండన్‌ హైకోర్టు ఆదేశించింది. ముందస్తుగా రూ. 2,516 కోట్లు చెల్లించాలంది.

మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో సెట​ల్‌మెంట్‌ చేయాల్సిందిగా చెప్పింది. పైగా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను భరించాలని కూడా స్పష్టం చేసింది. కాగా, ప్రపంచంలో అతిపెద్ద విడాకుల సెటిల్ మెంట్గా ఇది నిలువనుంది. అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్స్‌ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె, పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా సోదరి.

Dangerous Apps : మొబైల్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి

జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయి విడాకులు కోరింది. ప్రిన్సెస్‌ హయా బింట్‌ జర్మనీ దేశాన్ని ఆశ్రయం కోరింది. ఆపై దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్ తన పిల్లల్లను ఇ‍వ్వమంటూ జర్మనీకి చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి.

Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

ఈ మేరకు ఆమె తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో యూకే కోర్టు.. మాజీ భార్య భద్రతకు, వారి ఇద్దరూ పిల్లలు అల్ జలీలా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్(14), షేక్ జాయెద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్(9)ల భద్రతకు అయ్యే ఖర్చుని ఇవ్వాల్సిందేగా దుబాయ్‌ పాలకుడు అల్-మక్తూమ్‌ని ఆదేశించింది.