Johannesburg Explosion : జోహన్నెస్‌బర్గ్‌లో పేలుడు ఒకరి మృతి, 48 మందికి గాయాలు

జోహన్నెస్‌బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించగా, మరో 48 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి మినీ బస్సు ట్యాక్సీలు బోల్తాపడ్డాయి. ఈ పేలుడు వల్ల రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు కారణంగా పాదచారులు పరుగులు తీశారు....

Johannesburg Explosion : జోహన్నెస్‌బర్గ్‌లో పేలుడు ఒకరి మృతి, 48 మందికి గాయాలు

Johannesburg Explosion

Johannesburg Explosion : జోహన్నెస్‌బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించగా, మరో 48 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి మినీ బస్సు ట్యాక్సీలు బోల్తాపడ్డాయి. ఈ పేలుడు వల్ల రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు కారణంగా పాదచారులు పరుగులు తీశారు. (Explosion hit Johannesburg) రద్దీ సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టరులో పోస్టు చేశారు.

Earthquake : మణిపూర్, జైపూర్‌లో భూకంపం..భయాందోళనల్లో జనం

అగ్నిమాపక సిబ్బంది వాహనం కింద వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ పేలుడుకు భూగర్భ గ్యాస్ పంపిణీ చేసే పైపులైన్లు కారణమని భావిస్తున్నారు. భూగర్భ పైపులు, గ్యాస్ లీక్ ప్రమాదంపై నిపుణులను తీసుకువచ్చి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడుకు కారణాలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని జోహన్నెస్‌బర్గ్ ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ చెప్పారు.

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన 12 మంది జొహన్నెస్‌బర్గ్‌లోని పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. గాయపడిన మరో 36 మందికి చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. ఈ పేలుడు వల్ల జోహన్నెస్‌బర్గ్ నగరంలోని డౌన్‌టౌన్ విభాగంలో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోవచ్చనే భయంతో కొంతమందిని ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయించారు.