Great Father : కూతురి కోసం ఎంత కష్టమైనా సరే.. స్కూల్ ఈవెంట్‌లో వీల్ ఛైర్‌పై కూర్చుని డాన్స్ చేసిన తండ్రి

తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూతురి ఆనందం చూడాలనుకున్నాడు ఓ తండ్రి. వీల్ ఛైర్‌పై ఉండి కూడా కూతురితో కలిసి స్కూల్ ఈవెంట్‌లో డ్యాన్స్ చేశాడు. ఆ తండ్రి ప్రేమకు అందరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.

Great Father : కూతురి కోసం ఎంత కష్టమైనా సరే.. స్కూల్ ఈవెంట్‌లో వీల్ ఛైర్‌పై కూర్చుని డాన్స్ చేసిన తండ్రి

Great Father

Great Father :  తమ పిల్లల ఇష్టాలు తీర్చడానికి పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాళ్లకి ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని తాపత్రయపడతారు. కూతురి స్కూల్ ఈవెంట్‌లో వీల్ చైర్లో ఉండి కూతురితో డ్యాన్స్ చేసాడు ఓ తండ్రి. ఈ వీడియో ఇప్పుడు అందరి హృదయం కదిలిస్తోంది.

bride dance viral : దిల్బరో పాటకు స్టెప్పులు వేసిన వధువు.. కన్నీరు పెట్టుకున్న తండ్రి

చార్లెస్ పాటర్ అనే వ్యక్తి 2006 లో యూఎస్‌లోని వర్జీనియాలో ఓ తాగుబోతు డ్రైవర్‌తో గొడవ పడ్డాడు. ఆ సంఘటనలో డ్రైవర్ చార్లెస్‌ను కొట్టడంతో తీవ్ర గాయాల పాలై చార్లెస్ వీల్‌ ఛైర్‌కి పరిమితం అయ్యాడు. ఈ ఇన్సెడెంట్ తరువాత ఎటువంటి కదలికలు లేకుండా పోయిన తన శరీరాన్ని మరలా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చార్లెస్ చాలా కష్టపడ్డాడు. రీసెంట్ గా చార్లెస్ పాటర్ 6 ఏళ్ల కూతురు స్కూల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆమె క్లాస్ మేట్స్‌తో వాళ్ల తండ్రులు కలిసి డ్యాన్స్ చేసారు. చార్లెస్ కూడా స్టేజ్ పై వీల్ ఛైర్ మీద కూర్చుని కూతురితో స్పెప్పులు వేయించాడు. ఈ వీడియో అందరి మనసుల్ని హత్తుకుంది. కంటనీరు తెప్పించింది. అందరు అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నారు. కూతురి కోసం అతను చూపించిన ప్రేమకు ఫిదా అయ్యారు.

precious gift for father : తండ్రికి కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి .. చూడగానే ఆ తండ్రి కన్నీరు ఆగలేదు..

స్కూల్ సిబ్బంది పంపిన వీడియోని చూసి తండ్రీ కూతుళ్లిద్దరూ ఈ డ్యాన్స్ మూమెంట్స్ నేర్చుకున్నారట. అందుకోసం 4 రోజుల సమయం మాత్రమే పట్టిందట. కూతురి ఆనందమే తన ఆనందంగా భావించి తన శరీరం సహకరించకపోయినా పాటర్ ఎంత గొప్పగా డ్యాన్స్ చేయించాడో చూసారుగా.. చార్లెస్ పాటర్ నిజంగా గ్రేట్ ఫాదర్.

 

View this post on Instagram

 

A post shared by The CAPs (@thecapfamily_)