Viral Video : ఓరి నాయనో.. బాత్రూమ్‌లో చితక్కొట్టేసుకున్న అమ్మాయిలు, మరీ ఇంత దారుణంగానా..!

అమ్మాయిలు వీర లెవెల్ లో చితక్కొట్టేసుకున్నారు. బాత్రూమ్ అని కూడా చూడకుండా వీరావేశంతో ఇష్టమొచ్చినట్లుగా చితకబాదేసుకున్నారు.

Viral Video : ఓరి నాయనో.. బాత్రూమ్‌లో చితక్కొట్టేసుకున్న అమ్మాయిలు, మరీ ఇంత దారుణంగానా..!

young womens fighting at bathroom

in Pennsylvania : చిన్న చిన్న మాటలు..చిన్న చిన్న విషయాలు ఒక్కోసారి రాద్దాంతంగా మారిపోతుంటాయి. కొన్ని సార్లైతే అసలు అర్థం పర్ధం లేని వాటి కోసం కూడా పెద్ద పెద్ద గొడవగా మారిపోయి చిలికి చిలికి గాలివానగా మారి కొట్టుకునే వరకు వెళ్లిపోతుంటాయి. అదే మహిళల మధ్య అయితే ఆ గొడవ మరీ పెద్దది అయిపోవటమే కాదు ఏకంగా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లిపోతుంది. సరిగ్గా అటువంటి గొడవే ఇది. మహిళలు వీర లెవెల్ లో కొట్టుకున్న ఓ  వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.  బట్టల షాపుల్లో కొట్టుకున్నారని..వీధిలో నడిరోడ్డుమీద కొట్టుకున్నారని చూస్తుంటాం. కానీ బాత్రూమ్ లో కూడా కొట్టుకుంటారా..? అనేలా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కానీ ఇద్దరు మహిళలు ఏకంగా బాత్రూమ్ వద్దే కాదు బాత్రూమ్ లో పడి మరీ దారుణంగా కొట్టుకున్నారు. వారి కొట్టుడు ఎంత వరకు వెళ్లిందంటే వారిలో ఓ మహిళ ఒంటిమీదున్న డ్రెస్ కూడా ఊడిపోయేంతగా రచ్చ రచ్చగా మారిపోయింది. ఎందుకొచ్చింతో తెలీదు గానీ బాత్రూమ్ ల వద్ద ఇద్దరు మహిళలు ఎదురుపడి ఏవో మాట్లాడుకున్నారు. అంతే కొన్ని క్షణాల్లోనే కొట్టుకునేవరకు వెళ్లారు.

Studets Talent : క్లాస్‌రూమ్‌లో డెస్క్ మీద డ్రమ్స్ ఇరగదీసిన కుర్రాళ్లు,ఫ్యూచర్ ర్యాక్ బ్యాండ్ వీళ్లేనేమో

పెన్సిల్వేనియాలోని (Pennsylvania) పిట్స్‌బర్గ్ నగరం (Pittsburgh city )లో పీఎన్‌సీ పార్కు(PNC Park)లో బుధవారం (ఆగస్టు 30,2023)రాత్రి కొందరు యువతులు టెంపరరీగా ఏర్పాటు చేసిన బాత్రూమ్ ల వద్ద వచ్చారు. అక్కడ అప్పటికే మరికొంత మంది యువతులు ఉన్నారు. ముందుగా ఓ గ్రూపులోని యువతి బాత్రూమ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను ఇంకో మరో యువతి అడ్డుకుని డోరు మూసేస్తుంది. దీంతో కాసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అడ్డుకుంటున్న ఆమెపై దాడికి దిగింది. అలా ఇద్దరు ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్నారు.

కాసేపటికి మరికొందరు యువతులు అక్కడికి రావడంతో గొడవ మరీ రచ్చ రచ్చగా మారిపోయింది. వీరి గొడవను చూసి బాత్రూంలో ఉన్న మహిళలు చూసి షాక్ అయ్యారు. తరువాత వారు అక్కడినుంచి ఈ గొడవమధ్య మనమెందుకురా బాబూ అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే వీరావేశంతో ఊగిపోతున్న మరో యువతి మరోకామెను కాలితో తన్నింది. అలా ఇద్దరు బాత్రూమ్ లోపలికి పడిపోతారు. అయినా కొట్టుకోవటం మాత్రం ఆగలేదు.కాలితో తన్నుతు ఇష్టమొచ్చినట్లుగా రచ్చ రచ్చ చేసి పారేశారు.

Punjab : రెచ్చిపోయిన ఆవు.. వృద్ధుడిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేసిన భయానక వీడియో వైరల్

ఇంతలో కొందరు అక్కడికి వచ్చి వాళ్లను విడదీశారు. అతికష్టమ్మీద విడదీసి వారికి సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణుగుతుంది. ఈ గొడవ చాలాసేపు జరిగినట్లుగా కనిపిస్తోంది. ఎవరిని ఎవరు ఎందుకు కొడుతున్నారో..దానికి కారణమేంటో తెలీదుగానీ ఈవీళ్లు ఆడవాళ్లా వీధి రౌడీలా అనేలా వీర లెవెల్ లో కొట్టేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.