Afghanistan: -34 డిగ్రీలకు తగ్గిన ఉష్ణోగ్రత.. 78 మంది మృతి

తీవ్రమైన న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చలికాలం ప్రారంభంలలోనే ఆరోగ్య కార్యకర్తలు నివేదించారు. పేదరికం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో తగిన వేడి ఏర్పాటు చేసుకోలేకపోతున్నట్లు వారు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు ఈ పరిస్థితుల్ని చక్కదిద్దకపోగా, మరింత తీవ్రానికి వెళ్తున్నాయి.

Afghanistan: అఫ్గనిస్తాన్‭లో ప్రజల పరిస్థితి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉంది. ఇప్పటికే తాలిబన్ పాలన వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తాజాగా వాతావరణ మార్పు కూడా విపత్తుగా తయారైంది. దేశంలో విపరీత స్థాయికి తగ్గిన ఉష్ణోగ్రతల కారణంగా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. తాజాగా అక్కడ రికార్డు స్థాయిలో మైనల్ (-)34 డిగ్రీల సెల్సియస్‭కు ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో సుమారు 78 మంది చనిపోయినట్లు గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, 15 ఏళ్ల కాలంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వడం ఇదే తొలిసారని తాలిబన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Delhi Politics: మీ పని మీరు చేయండి, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి.. ఢిల్లీ ఎల్జీతో కేజ్రీవాల్

ఎన్జీవోలో మహిళలు పని చేయకూడదని తాలిబాన్ తీర్పునివ్వడంతో అనేక సహాయక బృందాలకు కార్యకర్తల కొరత ఏర్పడింది. దీంతో దేశంలో అనేక ఏజెన్సీలు తమ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నాయి. ఈ కారణంగా సరైన సమయానికి సరైన సదుపాయాలు అందక కూడా కొంత మంది మరణిస్తున్నారట. మహిళా కార్మికులపై విధించిన ఆంక్షలు సహాయాన్ని అందించే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ గత వారం తెలిపింది.

Priyanka Chopra : సరోగసీ ద్వారా బిడ్డని అందుకే కనాల్సి వచ్చింది.. ప్రియాంక చోప్రా!

తీవ్రమైన న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చలికాలం ప్రారంభంలలోనే ఆరోగ్య కార్యకర్తలు నివేదించారు. పేదరికం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో తగిన వేడి ఏర్పాటు చేసుకోలేకపోతున్నట్లు వారు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు ఈ పరిస్థితుల్ని చక్కదిద్దకపోగా, మరింత తీవ్రానికి వెళ్తున్నాయి. ఈ చలి కారణంగా గత తొమ్మిది రోజుల్లో సుమారు 77,000 పశువులు కూడా చనిపోయినట్లు సమాచారం. ఇది దేశ ఆహార అభద్రతను మరింతగా పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Madhya Pradesh : ‘బీజేపీలో చేరండి లేకుంటే బుల్డోజర్లు రెడీ ఉన్నాయ్’ : కాంగ్రెస్ నేతలకు బీజేపీ మంత్రి హెచ్చరిక

“మరి కొద్ది రోజులు వాతావరణం ఇదే స్థాయిలో ఉంటుంది. అందువల్ల బాధిత ప్రజలకు మానవతా సహాయం అందించడం చాలా అవసరం” అని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖలోని అత్యవసర పరిస్థితుల ఆపరేషన్ కేంద్రం అధిపతి అబ్దుల్లా అహ్మదీ అన్నారు. “21.2 మిలియన్ల మందికి అత్యవసరంగా నిరంతర ఆహారం, వ్యవసాయ మద్దతు అవసరమయ్యే సమయంలో కోల్పోయిన జీవనోపాధిని కల్పించాల్సిన అవసరం ఉంది” అని యూఎన్ఓసీహెచ్‭ఏ ట్విట్టర్‌లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు