Glass Octopus: గాజు శరీరంతో అక్టోపస్.. అరుదైన ఫొటోను చూశారా

అరుదైన వింతగా కనిపించే అక్టోపస్ ఫొటోను క్లిక్ అనిపించారు సముద్ర సైంటిస్టులు. ఫసిఫిక్ మహా సముద్రంలో కనిపించిన ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Glass Octopus: గాజు శరీరంతో అక్టోపస్.. అరుదైన ఫొటోను చూశారా

Octopus

Glass Octopus: అరుదైన వింతగా కనిపించే అక్టోపస్ ఫొటోను క్లిక్ అనిపించారు సముద్ర సైంటిస్టులు. ఫసిఫిక్ మహా సముద్రంలో కనిపించిన ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

34 రోజుల పాటు సమయం కేటాయించి ప్రయోగం జరిపారు సైంటిస్టులు. 30వేల కిలోమీటర్ల కంటే లోతుకు వెళ్లిన బృందం కెమెరా కంటికి ఈ జీవి కనిపించింది. ఇది చాలా అరుదైనదని, పూర్తిగా ట్రాన్స్‌పరేంట్‌గా ఉందని చెప్తున్నారు. దాని లోపల ఉన్న ఆప్టిక్ నెర్వ్, కళ్లు, జీర్ణ వ్యవస్థ మాత్రం స్పష్టంగా కనిపించాయి.

కనిపించని సముద్ర లోపలి తలాన్ని బయటపెట్టడానికి ఇది చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంటుందని ఎక్స్‌పెడిషన్ ఛీఫ్ సైంటిస్ట్ డా. రండీ రోజన్ అంటున్నారు.

సముద్ర జ్ఞానం గురించి స్థిరమైన అభివృద్ధి సాధించే దశాబ్దంలో ఉన్నాం. సముద్రంలో జరిగే విపత్తులు, అక్కడ జరిగిన మ్యాప్స్, ఫుటేజీ, డేటా వంటి అంశాలు నిర్ణయాలు తీసుకోవడంలో పాలసీ, మేనేజ్మెంట్ కు ఉపకరిస్తాయి.

గతంలో కనిపించిన వాటికంటే అరుదైనదిగా కనిపించిన ఈ లైవ్ ఫుటేజ్ అద్భుతంగా ఉందంటూ దానిపైన మరిన్ని పరిశోధనలు జరపొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.