Russia-Ukraine War : రష్యా సైనికులకు చుక్కలు చూపించిన ‘మేక’..! 40మందికి గాయాలు..!!

రష్యా సైనికులకు చుక్కలు చూపించిన ‘మేక’..40మందికి గాయాలు అయ్యేలా చేసింది..!

Russia-Ukraine War : రష్యా సైనికులకు చుక్కలు చూపించిన ‘మేక’..! 40మందికి గాయాలు..!!

Russia Ukraine War .. “goat Of Kyiv” 40 Soldiers Injured

Russia ukraine war .. “Goat of Kyiv” : 5 నెలలుగా రష్యా యుక్రెయిన్ లో కొనసాగిస్తున్న యుద్ధంలో దేశాన్ని మరుభూమిగా మార్చేస్తోంది. రష్యా సైనికులు బాంబులతో..క్షిపణులతో యుక్రెయిన్ పై స్వైరవిహారం చేస్తున్నారు. రష్యా ఆర్మీ అంటే ఎంత బలమైనదో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ అంతటి గొప్ప సైనికులను యుక్రెయిన్ లో ఓ ‘మేక’వణించేసింది. రష్యా సైనికులకు చుక్కలు చూపించింది ఓ మేక. ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మేక చేసిన పనికి 40మందికిపై రష్యా సైనికులు గాయాలపాలయ్యారు.ఓ మేక రష్యా సైనికులను వణికించిందని..40 మందికిపైగా గాయపడటానికి కారణమైందని యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఓ సాధారణ మేక చేసిన పనికి రష్యా సైనికులు ఎందుకు వణికిపోయారు.ఎందుకు గాయాలపాలయ్యారు అంటే..

యుక్రెయిన్ లోని జపొరోజియా పట్టణానికి కాస్త దూరంలో ఉన్న కిన్ స్కీ రోజ్డొరీ గ్రామంలోని ఓ ఆస్పత్రి సమీపంలో రష్యా సైనికులు బూబీ ట్రాప్ లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. గ్రనేడ్లను నేలలో వరుసగా అమర్చి వాటికి తీగలను అనుసంధానం చేసి పెడుతున్నారు. ఎవరైనా అటువైపుగా వచ్చినప్పుడు కాలికి ఆ తీగలు తాకి.. గ్రనేడ్లు పేలిపోతాయి.

సైనికులు అలా ట్రాప్ లను అమర్చుతుండగా..సరిగ్గా అదే సమయంలో కాస్త దూరంలో ఉన్న ఓ మేకల ఫామ్ నుంచి ఓ మేక తప్పించుకుని బయటికి వచ్చింది. ఆస్పత్రివైపు వెళ్లి సైనికులు బూబీ ట్రాప్ లను అమర్చుతున్న ప్రాంతం వైపు పరుగెత్తింది. మొదట ఒక ట్రాప్ దాని కాలికి తగిలి గ్రనేడ్ పేలింది. దీనితో భయపడిన మేక వేగంగా పరుగెత్తడంతో వరుసగా ఒకదాని తర్వాత మరోటి గ్రనేడ్ లన్నీ పేలిపోయాయి. వాటిని అమర్చుతూ వెళ్తున్న రష్యా సైనికులు కకావికలంగా పరుగులుపెట్టారు. ఈ పేలుళ్లలో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని.. కొందరు చనిపోయి ఉంటారని యుక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి.

కాగా..ఇంత ఘనమైన పని చేసిన మేక ఈ పేలుళ్లలో చనిపోయిందా? లేదా అనేది తెలియలేదు. ఎందుకంటే ఆ ప్రాంతం రష్యా సైనికుల ఆధీనంలో ఉందని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. మొత్తానికి రష్యా సైనికులను వణికించిన ఈ మేకను ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడం గమనార్హం.దీంతో ఆ మేకగారి ఘనకార్యం కాస్తా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.