రాజా కుబేరుడా..గోల్డెన్ ప్యాలెస్, 7వేల లగ్జరీ కార్లు, గోల్డ్ కోటింగ్ విమానం..ప్రతీ అంగుళం బంగారమే..

రాజా కుబేరుడా..గోల్డెన్ ప్యాలెస్, 7వేల లగ్జరీ కార్లు, గోల్డ్ కోటింగ్ విమానం..ప్రతీ అంగుళం బంగారమే..

Golden Brunei King Hassanal Bolkiah : దేశాన్ని ఏలే రాజుల ధనం,దర్పాలను సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ ఓ రాజుని చూస్తే అతను రాజా? లేక అపర కుబేరుడా? అంత బంగారమా? అంత లగ్జరీయా? అంత సంపాదనా? అని కళ్లు తేలేయాల్సిందే. ఆ రాజు వైభోగం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అంతా బంగారం మయమే.

బంగారంతో తాపడం చేసిన 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యంత లగ్జరీ ప్యాలెస్,బంగారం పూత పూసిన సొంత విమానం, ఏకంగా 7వేల లగ్జరీ కార్లు ఇంకా బంగారంతో చేసిన వస్తువలకు లెక్కేలేదు. అతని లగ్జరీ గురించి వింటే అతను రాజా లేక అపర కుబేరుడా అనే డౌట్ వచ్చే తీరుతుంది. రాచరికాలు అంతం అయిపోయినా..రాజు స్వయంగా అధికారంలో లేకపోయినా అంతా ఆయన చెప్పుచేతల్లో నడవాల్సిందే…అతనే ‘‘ద గ్రేట్ సుల్తాన్.. బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా’’..!!

బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా సంపాదన మామూలుగా ఉండదు. ఊహించటానికే సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో రాచరికం అంతరించిపోయాయి. కానీ ఆ రాజరికపు ఆనవాళ్లు మాత్రం గత చరిత్రను చాటి చెబుతుంటాయి. వాటి రాజసాల గురించి చెబుతుంటాయి. అటువంటి దేశమే బ్రూనై.

బూనై రాజు హస్సనల్ బొల్కియా. ఆయన స్వయంగా అధికారంలో లేకపోయినా అంతా ఆయన చెప్పుచేతల్లో నడవాల్సిందే. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతాయి. చీమ చిటుక్కుమనాలన్నా రాజు అనుమతి ఉండాల్సిందే. బ్రూనైలో సుల్తాన్ గా వ్యవహరిస్తున్న హసనల్ బొల్కియా ఆ దేశానికి రాజు.

ఆయనకు బంగారం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే తన ప్యాలెస్ ను బంగారంతో తాపడం చేయించుకున్నారు. ఇస్తానా నూరుల్ ఎమాన్ ప్యాలెస్ ను 1984లో చాలా ఇష్టంతో స్వయానా కట్టించుకున్నాడు. ఈ ప్యాలెస్ 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రాజసంగా బంగారపు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.

ఈ ప్యాలెస్ గోపురాన్ని 22 క్యారెట్ల బంగారంతో తాపడం చేయించాడు రాజు. ఈ ప్యాలెస్ విలువ రూ. 2,550 కోట్లకు పైమాటే అని నిపుణులు అంచనా వేస్తారు. కానీ అంతకంటే ఎక్కువే ఉంటుందని అంటారు. ఈ ప్యాలెస్ లో 1700 కి పైగా గదులు, 257 బాత్రూంలు, ఐదు స్విమ్మింగ్ పూల్స్, 110 గ్యారేజీలు, గుర్రాలకు ప్రత్యేకంగా 200 ఎయిర్ కండిషన్డ్ గదులున్నాయి. అంటే ఎంత రాజసంగా ఉంటుందో ఊహించుకోవచ్చు..ఈ బంగారపు ప్యాలెస్ ముందు ఓ కొలను ఉంటుంది. ఆ కొలనులో బంగారు రంగులో మెరిసిపోయే ప్యాలెస్ అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు…!!

రాజు హస్సనల్ బొల్కియాకు ఏడు వేల కార్లున్నాయి. అవన్నీ లగ్జరీ కార్లే. ఆ కార్లలో కొన్నింటికి బంగారంతో కోటింగ్ వేయించారు రాజు హాస్సనల్. ఈ కార్ల విలువ సుమారు 341 బిలియన్ డాలర్లు ఉంటుంది. వీటిలో 600 రోల్స్ రాయిస్, 300 ఫెరారీలను ఉన్నాయి…!!

 

 

రాజు హస్సనల్ బొల్కియా ప్యాలెస్ లో ఎక్కడ చూసినా బంగారమే కనిపిస్తుంది. టైనింగ్ టేబుల్, తినే కంచాలు,గిన్నెలు, గ్లాసుల, స్పూన్లు,ఫోర్కులు, ఫ్లవర్ వాజ్ లు, పండుకునే మంచాలు, వేసుకునే బట్టలు, ఆఖరికి బాత్రూమ్ లో బాతింగ్ టబ్ లు కూడా బంగారంతో చేసినవే. సోప్ బాక్సులు, ఇలా ఏది చూసినా బంగారంతో చేసినవే కనిపిస్తాయి.

 


ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన సుల్తాన్లనో ఒకరిగా రికార్డు క్రియేట్ చేశారు. 1980 వరకు ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు హోదా అనుభవించారు. హసనల్ బొల్కియా కు రూ. 14,700 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అంతేకాదండోయ్ ఈ రాజుగారికి పలు ప్రైవేట్ జెట్ లు కూడా ఉన్నాయి. బోయింగ్ 747-400 బోయింగ్ 767-200, ఎయిర్ బస్ ఎ 340-200 జెట్ లు ఉన్నాయి. బోయింగ్ 747-400 జెట్ ను బంగారంతో పూత వేయించారు. ఈ విమానంలో సౌకర్యాలకు కొదవేలేదు.

లివింగ్ రూమ్ సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి…!! ఇలా చెప్పుకుంటూ పోతే రాజు హస్సనల్ బొల్కియా లగ్జరీ గురించి సంపద గురించి చెప్పటానికి ఎన్నో ఉన్నాయి. ప్రతీ అంగుళం అంగుళం బంగారమే..పసిడి ముద్దలు పేర్చినట్లుగా కదలాడుతుంటారు ‘‘ద గ్రేట్ సుల్తాన్.. బ్రూనై రాజు హస్సనల్ బొల్కియా’’..!!