Adolf Hitler : హిట్లర్ ధరిచిన వాచీ వేలంలో ఎన్ని కోట్లు పలికిందో తెలుసా…

నాజీ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ ధ‌రించిన ఓ వాచ్‌ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్‌ సుమారు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయిన‌ట్లు తెలిపారు.

Adolf Hitler : హిట్లర్ ధరిచిన వాచీ వేలంలో ఎన్ని కోట్లు పలికిందో తెలుసా…

Hitler Watch On Auction

Adolf Hitler :  నాజీ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ ధ‌రించిన ఓ వాచ్‌ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్‌ సుమారు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయిన‌ట్లు తెలిపారు. ఈ వేలం చాలామందిని ఆకర్షించింది. హ్యూబ‌ర్ కంపెనీ ఈ వాచీని హిట్ల‌ర్‌కు పుట్టిన రోజు కానుక‌గా ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

ఆ వాచ్‌పై స్వ‌స్తిక్ తో పాటు ఏహెచ్ అనే గుర్తులు ఉన్నాయి. మేరీల్యాండ్‌లోని అలెగ్జాండ‌ర్ హిస్టారిక‌ల్ ఆక్ష‌న్ హౌస్‌లో వేలం జ‌రిగింది.  ఈ వేలాన్ని యూదు నేత‌లు ఖండించారు. 1933, ఏప్రిల 20 ఈ వాచ్‌ను హిట్ల‌ర్‌ 44వ బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఆ ఏడాదే ఆయ‌న జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1945లో బెర్‌గాఫ్‌లో ఉన్న హిట్ల‌ర్ ఇంటిని అటాక్ చేసిన స‌మ‌యంలో అక్క‌డ ఫ్రెంచ్ సైనికులకు ఈ వాచ్‌ చిక్కింది.