Hindu University of America : అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలు బోధించే వర్సిటీకి రూ.8.20 కోట్లు విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త

అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలు బోధించే వర్సిటీకి భారతీయ అమెరికా వ్యాపారవేత్త రూ.8.20 కోట్లు విరాళం అందజేసారు. హిందూ తత్వశాస్త్రం గురించి నేటి యువత తెలుసుకోవాలని సూచించారు.

Hindu University of America : అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలు బోధించే వర్సిటీకి రూ.8.20 కోట్లు విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త

Hindu University of US

Hindu University of US : అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలను బోధిస్తున్న హిందూ యూనివర్సిటీకి అమెరికా వ్యాపారవేత్త భారీ విరాళం ఇచ్చారు. ఫ్లోరిడా రాష్ట్రంలో 1989లో ప్రారంభమైన హెచ్‌యూఏ 1993లో ఫ్లోరిడా ప్రభుత్వ గుర్తింపుపొందిన హిందూ యూనివర్శిటీ ఆఫ్ అమెరికాకు హిందూ యూనివర్శిటీకి(Hindu University of America)కు ఓ ఇండో అమెరికన్‌ వ్యాపారవేత్త 10 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.802. కోట్లు విరాళం ప్రకటించారు.

భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త హ్యూస్టన్‌లోని స్టార్‌ పైప్‌ ప్రొడక్ట్స్‌ సీఈవో రమేశ్‌ భూటాడా రూ.8.20 కోట్లు అందజేశారు. భారీ విరాళాన్ని అందించిన రమేశ భూటాడాను వర్శిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కాగా..ఈ యూనివర్శిటీకి వచ్చిన విరాళాల్లో రమేశ్ భూటాడీ అందించిందే అతి పెద్ద విరాళం. రానురాను ఇటువంటి విద్యకు ఆదరణ తగ్గిపోతోంది. ఇటువంటి అరుదైన విద్యను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ వర్శిటీ కృషి చేస్తోంది. నేటి తరం యువత హిందూమతానికి సంబంధించిన విషయం పరిజ్ఞాన్ని అలవర్చుకోవాలని..తద్వారా చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని దాత రమేశ్ భూటాడా ఆశించారు. అందుకే ఈ విరాళాన్ని అందించానని తెలిపారు.
కాగా..హిందూ తత్వశాస్త్రం ఆధారంగా విద్యను అందించటమే లక్ష్యంగా ఉన్న ఏకైక విద్యా సంస్థ హిందూ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా.

రమేశ్ భూటాడాను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతు..నేను సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టానని..అనేక హిందూ సంస్థల్లో సభ్యుడిగా ఉన్నానని అయినా హిందూ మతం సారాంశాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానని కానీ నేటి యువత ఈ హిందూ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుని వారి జీవితాలను తీర్చి దిద్దుకోవాలని సూచించారు.హిందూ మతంలోని నిజమైన సారాంశాన్ని అర్థం చేసుకోవాటానికి నాకు 60 ఏళ్లు పట్టిందని తెలిపారు. మన కుటుంబం, స్నేహితులు,సహోద్యోగులు, ప్రపంచంలో ఎలా సామరస్యంగా జీవించాలో హిందూమతం నేర్పుతుందని హిందూమతంలో తత్వశాస్త్రంలో ఉన్న గొప్పతనం అది అని యూనివర్శిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.