Bride Bill : పెళ్లికి రాలేదని..! ఫ్రెండ్ కు రూ.17వేల బిల్లు పంపిన వధువు

పెళ్లికి వస్తానని రాని ఓ అతిథికి రూ.17,700లు బిల్ పంపించింది వధువు. ఆ డబ్బులు వెంటనే కట్టాలని..బిల్ తో పంపించేసరికి సదరు గెస్ట్ షాక్ అయ్యాడు.పెళ్లికి రాకపోతే ఇలా బిల్ పంపిస్తారా?..

Bride Bill : పెళ్లికి రాలేదని..! ఫ్రెండ్ కు రూ.17వేల బిల్లు పంపిన వధువు

Bride Bill

bride sends wedding bill : బంధుమిత్ర సపరివారంగా వివాహానికి రావాలని ఎవరన్నా వెడ్డింగ్ కార్డు ఇస్తే..వెళ్లాలి. వాళ్లు చాలా ప్రేమాభిమానాలతో పిలిచారు కాబట్టి. కానీ పిలిచినవాళ్లంతా రాకపోవచ్చు. పిలిస్తే రాలేదని కోపగించుకోవచ్చు.కొన్నాళ్లు మాట్లాకపోవచ్చు.కానీ ‘పెళ్లికి పిలిస్తే రాలేదని..ఫ్రెండ్ కు లేదా అతిథికి జరిమానా వేస్తారా ఎవరైనా..కానీ ఓ వధువు దాదాపు అదే పనిచేసింది. దాన్ని జరిమానా అనుకున్నా..బిల్ అనుకున్నా ఫరవాలేదు. పెళ్లికి వస్తానని మాటిచ్చి రాలేదని ఓ అతిథికి ఓ వధువు దాదాపు 18వేల రూపాయల బిల్ పంపించింది. ఆ బిల్ చూసిన సదరు అతిథి షాక్ అయ్యాడు. ఇలాక్కూడా చేస్తారా? వామ్మో అంటూ నోరెళ్లబెట్టాడు. ఈ బిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పెళ్లికూతురు వివరాలు తెలియవు గానీ బిల్ మాత్రం వైరల్ కావటంతో ఇదికాస్తా స్పెషల్ గా మారింది. ఓ వధువు తన వివాహానికి కచ్చితంగా రావాలని ఓ ఫ్రెండ్ ని పిలిచింది. దానికి అతను కచ్చితంగా వ‌స్తాన‌ని మాటిచ్చాడ‌ట‌. ఒంటిగా కాదు ఏకంగా జంటగా వ‌స్తామ‌ని మాటివ్వ‌డంతో..వారిద్ద‌రి కోసం వధువు రెండు సీట్ల‌ను రిజ‌ర్వ్ చేసింద‌ట. రెండు సీట్ల‌ను రిజ‌ర్వ్ చేసినందుకు..ఒక్క సీటుకు 120 డాల‌ర్ల చొప్పున‌.. 240 డాల‌ర్ల‌ను అయ్యింది.

కానీ వస్తానని చెప్పిన ఆ అథితుల జంట రానేలేదు. పెళ్లి రిసెప్ష‌న్‌కు రాలేద‌ట‌. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ పెళ్లి కూతురు వస్తానని చెప్పి రాలేదు.ఈ డబ్బులు అతని నుంచే వసూలు చేయాలని అనుకుందో ఏమోగానీ..ఆ జంట కోసం రిజర్వ్ చేసిన రెండు సీట్ల‌ కోసం అయిన ఖ‌ర్చు 240 డాల‌ర్లు.. అంటే మ‌న క‌రెన్సీలో 17,700 రూపాయ‌ల బిల్లును అత‌డికి పంపించింది.

నువ్వు క‌నీసం రిసెప్ష‌న్‌కు రావ‌డం లేద‌ని కూడా స‌మాచారం ఇవ్వ‌లేదు. రిసెప్ష‌న్‌కు రాకుండా ఎగ్గొట్టావు. నీ కోసం రిజ‌ర్వ్ చేసిన సీట్ల కోసం నేను చెల్లిన డ‌బ్బుల‌ను నువ్వే చెల్లించాలి అని తెగేసి చెప్పింది. జెల్లే లేదా పేపాల్‌.. ఏదైనా పఫర్వాలేదు.. ఏ పేమెంట్ ద్వారా అయినా ఫరవాలేదు.ఎమౌంట్ రావటం ఇంపార్టెంట్..వెంటనే పంపించు..అంటూ ఇన్‌వాయిస్‌తో పాటు.. ఒక నోట్‌ను కూడా పంపించింది ఆ న‌వ వ‌ధువు. ఆ వ‌ధువు పంపించిన బిల్లు.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు.. అయితే త‌మ‌కు తోచిన విధంగా ఆ బిల్లుపై స్పందిస్తున్నారు. ఏంటీ పెళ్లికి రాకపోతే ఇలా కూడా చేస్తారా? మరి విడ్డూరం కాకపోతే అంటున్నారు.