Princess: సామాన్యుడితో లవ్‌లో రాజకుమారి.. ప్రియుడు కోసం కోట్ల ఆస్తులు, కోట వదిలుకుని!

మూడేళ్ల నిరీక్షణ తరువాత తన ప్రేమను గెలిపించుకుంది జపాన్‌ రాజకుమారి.

Princess: సామాన్యుడితో లవ్‌లో రాజకుమారి.. ప్రియుడు కోసం కోట్ల ఆస్తులు, కోట వదిలుకుని!

Princess

Princess: మూడేళ్ల నిరీక్షణ తరువాత తన ప్రేమను గెలిపించుకుంది జపాన్‌ రాజకుమారి. సామాన్యుడైన కొమురోను లవ్ చేసి పెళ్లి చేసుకుంది రాజకుమారి మకో. తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఎంతో విలాసవంతమైన లైఫ్‌ను త్యాగం చేసింది రాజకుమారి. రాచరికాన్ని, కోట్ల సంపదను వదులుకుని కిమురోతో కలిసి బతకాలని నిర్ణయించుకుంది.

మకో, కిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ అధికారికంగా ప్రకటించింది. పెళ్లి తరువాత మకో రాజప్రాసాదాన్ని వీడారని, వీరి వివాహానికి మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్యాలెస్‌లో ఎలాంటి వేడుకలు నిర్వహించలేదని వెల్లడించింది రాజప్రసాదం. అయితే, సంప్రదాయం ప్రకారం వీడ్కోలు పలికినట్లు రాజప్రసాదం వెల్లడించింది.

ఇంటి నుంచి బయటకొచ్చే ముందు మకో తన తల్లిదండ్రులను, సోదరిని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. జపాన్ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తె మకో, టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అక్కడే సామాన్యుడైన కొమురో ప్రేమ మొదలైంది. 2017లోనే ఈ జంట ప్రేమవివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.

అయితే మరుసటి ఏడాది కొమురో తల్లి కారణంగా ఆర్థిక వివాదాలు తలెత్తడంతో పెళ్లి రద్దయింది. దీంతో కొమరో లా చదవడానికి 2018లో న్యూయార్క్ వెళ్లిపోయారు. మూడేళ్ల తరువాత గత నెలలో చదువు పూర్తి చేసుకుని కొమురో స్వదేశానికి తిరిగి వచ్చారు. మళ్లీ వీరి పెళ్లి ప్రతిపాదన రావడంతో ఆర్థిక వివాదంపై స్పష్టత ఇవ్వాలని మకో తండ్రి కొమురోను అడిగారు. దీనిపై లిఖిత పూర్వక హామీ కొమురో ఇవ్వడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించారు.