Jordan Man : సెల్ ఫోన్‌‌లో చిలిపి పని చేసిన భార్య..విడాకులు ఇచ్చిన భర్త

తల్లి నిద్రపోతున్న సమయంలో..ఆమె చేసిన గురకను రికార్డు చేయడమే ఇందుకు కారణం. నిద్రపోతున్న సమయంలో.. అత్త గురక పెట్టింది.

Jordan Man : సెల్ ఫోన్‌‌లో చిలిపి పని చేసిన భార్య..విడాకులు ఇచ్చిన భర్త

Cellphone

Mother In Law Snoring : చిన్న చిన్న కారణాలకే భార్య, భర్తలు విడిపోతున్నారు. క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొడవలు, ఘర్షణలతో విడాకులు తీసుకుంటున్నారు. చిన్న చిన్న పనులే కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి. భార్య చేసిన ఓ చిలిపి పనికి విడాకులు ఇచ్చేశాడు ఓ భర్త. జోర్డాన్ దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి నిద్రపోతున్న సమయంలో..ఆమె చేసిన గురకను రికార్డు చేయడమే ఇందుకు కారణం. అత్త నిద్రపోతున్న సమయంలో..గురక పెట్టింది.

Read More : India Covid : 8 లక్షల మందికి కరోనా పరీక్షలు..10 వేల కేసులు

కోడలుకు చిరాకు తెప్పించింది. ఆమె గురకను సెల్ ఫోన్ లో రికార్డు చేసింది. అంతటితో ఊరుకోకుండా…కుటుంబసభ్యుల వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసింది. ఈ విషయం భర్తకు తెలిసింది. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన భర్త…ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో అక్కడ అధికంగా విడాకులు తీసుకుంటున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2011లో 1,000గా ఉన్న విడాకుల సంఖ్య.. 2016లో 21,969కి పెరిగింది. చిన్న చిన్న సంఘటనలతోనే దంపతులు విడాకుల దాకా వెళ్తున్నారని తెలుస్తోంది.