Kim Jong Un : నో బాడీ డబుల్..20 కిలోల బరువు తగ్గిన కిమ్

నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) 20 కిలోల బరువు తగ్గారని దక్షిణ కొరియా నిఘా సంస్థ తెలిపింది. 2019లో 140 కేజీల వరకు బరువు ఉన్న కిమ్..అప్పటి నుంచి తన బరువును

Kim Jong Un : నో బాడీ డబుల్..20 కిలోల బరువు తగ్గిన కిమ్

Kim

Kim Jong Un నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(37) 20 కిలోల బరువు తగ్గారని దక్షిణ కొరియా నిఘా సంస్థ తెలిపింది. 2019లో 140 కేజీల వరకు బరువు ఉన్న కిమ్..అప్పటి నుంచి తన బరువును తగ్గించుకుంటూ వచ్చారని గురువారం దక్షిణకొరియా నిఘాసంస్థ ఆ దేశ చట్టసభ సభ్యులకు తెలిపింది.

సరైన ముఖ విశ్లేషణ, బరువు-ట్రాకింగ్ మోడల్స్ మరియు హై-రిజల్యూషన్ వీడియో యొక్క విశ్లేషణ ఆధారంగా నిఘా సంస్థ కిమ్ బరువుని అంచనావేసిందని దక్షిణకొరియా అధికార పార్టీ ప్రతినిధి కిమ్ బైంగ్-కీ విలేకరులతో అన్నారు.

అంతేకాకుండా,ప్రస్తుతం బయట ప్రపంచనాకి కనిపిస్తున్న కిమ్..ఒరిజినల్ కిమ్ కాదని,అసలు కిమ్ రహస్య స్థావరంలో ఉన్నాడంటూ గతంలో వచ్చిన పుకార్లను దక్షిణ కొరియా నిఘా సంస్థ కొట్టిపారేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉయోగించి తాము విశ్లేషించామని..కిమ్ జోంగ్ ఉన్ డబుల్ లేరని తెలిపింది. అంతేకాకుండా,కిమ్ జోంగ్ ఉన్ మంచి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపింది.

ALSO READ Kim Jong : ప్లీజ్ తక్కువ తినండి బాబు…కిమ్ వేడుకోలు