Kim Kardashian: అఫ్ఘాన్ మహిళా ప్లేయర్ల కోసం కిమ్ కర్దాశియన్ స్పెషల్ ఫ్లైట్

అఫ్ఘానిస్తాన్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకోసం కిమ్ కర్దాశియన్ చార్టర్ ఫ్లైట్ వేయించారట. న్యూయార్క్ ర్యాబీ, యూకే సాకర్ క్లబ్, కిమ్ కర్దాశియన్ వెస్ట్ చొరవతో గురువారం ఉదయం నాటికి బ్రిటన్...

Kim Kardashian: అఫ్ఘాన్ మహిళా ప్లేయర్ల కోసం కిమ్ కర్దాశియన్ స్పెషల్ ఫ్లైట్

Kim Kardasin

Kim Kardashian: అఫ్ఘానిస్తాన్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకోసం కిమ్ కర్దాశియన్ చార్టర్ ఫ్లైట్ వేయించారట. న్యూయార్క్ ర్యాబీ, యూకే సాకర్ క్లబ్, కిమ్ కర్దాశియన్ వెస్ట్ చొరవతో గురువారం ఉదయం నాటికి బ్రిటన్ చేరుకున్నారని అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు. విమానంలో 30మంది టీనేజర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కలిసి 130 మంది ప్రయాణించారు.

కరోనావైరస్ క్యారంటైన్ నిమిత్తం వారంతా ఒక పదిరోజుల పాటు ఎయిర్ పోర్ట్ సమీపంలోనే ఉంటారు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్లకు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చింది. ఆగష్టులో అఫ్ఘాన్‌ను తాలిబాన్లు ఆక్రమించుకోవడంతో వేలం మంది అఫ్ఘాన్లు బ్రిటన్‌తో పాటు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. తాలిబాన్ ఆక్రమణ అనంతరం మహిళలు క్రీడల పట్ల ప్రోత్సాహం, చదువుల్లో ఎంకరేజ్మెంట్ ఉండదని వలస వెళ్లిపోయారు.

అఫ్ఘానిస్తాన్ నేషనల్ ఉమెన్ టీం మాజీ కెప్టెన్ ఖలీదా పోపల్.. దీని పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇలా జరగడం చాలా మంచిదంటూ అభిప్రాయపడ్డారు. ‘తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా మంది ఇళ్లు వదిలివెళ్లిపోయారు. కొందరు కుటుంబ సభ్యుల్ను కాల్చేశారు. తీవ్రమైన ఒత్తిడి నెలకొనడంతో అఫ్ఘానిస్తాన్ బయట ప్రపంచమే బాగుందని వెళ్లిపోయారు.

………………………………………………….. : ఉద్యోగం పేరుతో మహిళలపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

పేద కుటుంబాలకు చెందిన వారు పాకిస్తాన్ చేరుకుని యూకే వీసాల కోసం ప్రయత్నించారు. అక్కడి నుంచి విమాన సర్వీసులు లేకపోవడం.. పాకిస్తాన్ లో ఉండేందుకు సైతం వీసాల గడువు పూర్తయిపోతుండటంతో నానా తంటాలు పడ్డారు.

నాన్ ప్రొఫిట్ ఆర్గనైజేషన్ అయిన Tzedek అసోసియేషన్ గ్రూప్ మెంబర్ ర్యాబీ మోషె మార్గెటెన్ టీవీ స్టార్ కర్దాశియన్ తో కలిసి పనిచేస్తున్నారు. ‘ప్లేయర్లు యూకే వెళ్లడం కోసం చార్టర్డ్ ఫ్లైట్ కావాలని ఆమెను హెల్ప్ అడగడంతో సరే అన్నారు. జూమ్ కాల్ మాట్లాడిన గంట తర్వాత విమానం మొత్తానికి తానే ఖర్చులు భరిస్తానంటూ మార్గరెటెన్ నుంచి మెసేజ్ వచ్చింద’ట. అలా మహిళా సాకర్స్ టీంను బ్రిటన్ చేర్చగలిగారు.