Lottery Prize: లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తికి సగం ప్రైజ్ అమౌంట్ ఇచ్చిన 86ఏళ్ల మహిళ

అదృష్టం పరీక్షించుకునేందుకు లేదా వ్యసనంగా మారో రోజూ లాటరీ టికెట్ కొనేవాళ్లను చూస్తుంటాం. విచిత్రంగా సగం అమౌంట్ ను లాటరీ టిక్కెట్ తనకు అమ్మిన వ్యక్తికే ఇచ్చేసిందామె.

Lottery Prize: లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తికి సగం ప్రైజ్ అమౌంట్ ఇచ్చిన 86ఏళ్ల మహిళ

Lottery Wiineer

Lottery Prize: అదృష్టం పరీక్షించుకునేందుకు లేదా వ్యసనంగా మారో రోజూ లాటరీ టికెట్ కొనేవాళ్లను చూస్తుంటాం. ప్రైజ్ మనీ గెలిస్తే వాళ్లకు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. డబ్బంతా తీసుకుని విచ్ఛలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. లేదంటే ఏదైనా వస్తువు కొనుక్కుంటారు. కానీ, ఇక్కడ విచిత్రంగా సగం అమౌంట్ ను లాటరీ టిక్కెట్ తనకు అమ్మిన వ్యక్తికే ఇచ్చేసిందామె.

డ్యూక్ మినీ మార్క్ అనే షాప్‌లో ఫారెస్ట్ అనే మహిళ రోజూ లాటరీ టికెట్ కొనుగోలు చేస్తుంటుంది. అందులో వాల్టర్ అనే క్యాషియర్ మీరు ఈ టికెట్ కొంటే 5లక్షల డాలర్లు గెలుచుకోవచ్చని చెప్పాడు. దానికి బదులిచ్చిన ఆమె ఒకవేళ తాను లాటరీ గెలిస్తే అందులో సగం ఇచ్చేస్తానని మాటిచ్చిందట.

అంతటి జాక్‌పాట్ పొందకపోయినా.. 300డాలర్లు గెలుచుకుంది ఫారెస్ట్. ఇచ్చిన మాట ప్రకారం లాటరీ టికెట్ అమ్మిన వాల్టర్ కు 150డాలర్లు ఇచ్చేయాలని ఫిక్స్ అయింది. ప్రైజ్ మనీలో సగం అమౌంట్ ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి దానిపై అతని పేరు రాసి బెలూన్లతో కలిపి అతనికిచ్చి సర్‌ప్రైజ్ చేసింది.

ఇది చదవండి: చలికాలంలో పెదాలను ప్రొటెక్ట్ చేయండిలా..

ఈ వీడియోలో వాల్టర్.. ఫారెస్ట్ మద్య జరిగిన ఆసక్తికర సంభాషణ చూడొచ్చు. ప్రపంచంలోనే ఇతను చాలా స్వీట్ పర్సన్ అంటూ పొగిడేశారు ఫారెస్ట్. ఆ మూమెంట్ ను ఇద్దరూ ఎంజాయ్ చేస్తుంటే స్టోర్ అంతా చూస్తూ ఉండిపోయింది.