Rapper Dan Sur అది జుట్టా బంగారం కొట్టా..! హెయిర్ స్టైల్ కోసం రూ.14 కోట్లు ఖర్చుచేసిన ర్యాపర్

మెక్సికోకు చెందిన ర్యాపర్‌ డాన్‌ సుర్ ర్యాపర్ తలంతా బంగారు గొలుసులతో తయారు చేసుకుని సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాడు.

Rapper Dan Sur అది జుట్టా బంగారం కొట్టా..! హెయిర్ స్టైల్ కోసం రూ.14 కోట్లు ఖర్చుచేసిన ర్యాపర్

Rapper Dan Sur (1)

Rapper Dan Sur gold chains Hairstyle : అమెరికా ర్యాపర్ ‘లిల్ ఉజీ వెర్ట్’ ర్యాపర్ నుదుటికి రూ.175 కోట్ల విలువైన పింక్ డైమండ్ కుట్టేసుకుని వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మనం చెప్పుకునే ర్యాపర్ ఏకంగా తలంతా బంగారం మయం చేసేకుని వైరల్ గా మారాడు. తలకు ఎవరైనా రంగు రంగుల డై వేసుకుంటారు. కానీ మెక్సికోకు చెందిన ర్యాపర్‌ డాన్‌ సుర్ ర్యాపర్ మాత్రం ఏకంగా తలంతా బంగారపు గొలుసులతో నింపేసుకున్నాడు. దాని కోసం ఏకంగా రెండు మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.14 కోట్లు ఖర్చుపెట్టి ‘‘వారెవ్వా ఏంటీ అది జుట్టా? బంగారం కొట్టా?’ అనిపిస్తున్నాడు.

Read more : నుదిటిపై రూ.రూ.175 కోట్ల పింక్ డైమండ్ అమర్చుకున్న ర్యాపర్

ప్రముఖ మెక్సికన్‌ ర్యాపర్‌ డాన్‌ సుర్‌ జుట్టుకుని బంగారు గొలుసులతో తయారు చేసుకుని సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాడు. దాదాపు రెండు మిలియన్‌ డాలర్లు ఖర్చెపెట్టాడు ఈ జుట్టుకోసం. తలపైభాగం మొత్తం పలు రకాల డిజైన్ల బంగారు గొలుసులతో అమర్చుకుని..బంగారు జుట్టు కలను మాత్రం నిజం చేసుకున్నాడు.ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘చూడండీ.. చూడండీ నా జుట్టు ఎలా ఉందో బంగారంలా మెరిసిపోతోంది అనుకంటున్నారా? అనుకోవటమేంటీ నిజంగా బంగారమే’’ అంటున్నాడు.

Read more : Vijayawada : దుర్గమ్మకు బంగారు డైమండ్ హారం, భక్తులపై ప్రత్యేక ఆంక్షలు

డాన్ సుర్ జుట్టు చూసిన నెటిజన్ల అది జుట్టా బంగారం కొట్టా ఎక్కడలేని గొలుసుల డిజైన్లు ఇతని తలమీదే ఉన్నాయే..అని కొంమంది అంటుంటే..బంగారంతో గొలుసు చేయించుకోవాలనుకునేవా డిజైన్లు కోసం డాన్ సుర్ హెయిర్ స్టైల్ చూస్తే సరిపోతుంది అంటున్నారు.ఇంకొందరు ‘అతని జుట్టు పీకితేచాలు లైఫ్‌ సెట్‌’, ‘గోల్డన్‌ స్కల్‌’ అంటూ ఫన్నీ ఫన్నీ గా రెస్పాండ్ అవుతున్నారు. కాగా..జుట్టుని ఇలా బంగారపు గొలుసులతోనే నింపేసేకున్న మొదటి ర్యాపర్ డాన్ సుర్ కావటం మరో విశేషం..’