Model Kazumi : సరిగా కూర్చోలేదు, అయినా నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది

ఆమె పేరు కజూమి. ఫ్లోరిడాకు చెందిన మోడల్. వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం ఈ మోడల్ న్యూస్ లోకి ఎక్కింది. దీనికి కారణం ఆమె అందంతో పాటు ఆమె పడుతున్న సమస్య.

Model Kazumi : సరిగా కూర్చోలేదు, అయినా నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది

Model Kazumi

Model Kazumi : ఆమె పేరు కజూమి. ఫ్లోరిడాకు చెందిన మోడల్. వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం ఈ మోడల్ న్యూస్ లోకి ఎక్కింది. దీనికి కారణం ఆమె అందంతో పాటు ఆమె పడుతున్న సమస్య. తన అందాన్ని మరింత మెరుగు చేసుకునేందుకు కజూమి సర్జరీ చేయించుకుంది. అయితే ఆ సర్జరీ ఫెయిల్ అయ్యింది. అయినా ఈ మోడల్ నెలకు అక్షరాల కోటి రూపాయలు సంపాదిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు.

కజూమి.. 14.8 లక్షలు ఖర్చు చేసి పెదాలు, వక్షోజాలకు, పిరుదులకు ఆపరేషన్ చేయించుకుంది. రెండు ఆపరేషన్లు సక్సెవ్ అయ్యాయి. అయితే, పిరుదులకు చేసిన చికిత్స మాత్రం వికటించింది. దీంతో ఆమె పెద్ద సమస్యే వచ్చి పడింది. కజూమి సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతోంది. అన్ని పనులు నిల్చుని చేయాల్సిన దుస్థితి. అయితే కాస్త అందంగా ఉండే ఈ భామ.. నెట్టింట ఫొటోలు పెట్టి భారీగా సంపాదిస్తోంది. తన అందచందాలతో జనాలను కట్టి పడేస్తోంది. తన ఫొటోల ద్వారా నెలకు కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే, ఎంత డబ్బు వచ్చినా ఇక ఆపరేషన్ల జోలికి మాత్రం అస్సలు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. onlyfans ద్వారా ఆమె ఈ డబ్బు సంపాదిస్తోంది.

నేను ప్రతి పనిని నిలబడే చేస్తాను. దిండుతో ప్రతిచోట వెళ్తాను. నా తుంటి మీద ఎలాంటి ఒత్తిడిని ఉంచే పరిస్థితి లేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా నా లుక్ ని మార్చుకోవడానికి నేను రెడీగా లేను. ఈ లుక్ తోనే నేను కోట్లు సంపాదిస్తున్నా అని కజూమి చెప్పింది.