Peru: పెరూలో కూలిన విమానం..ఎడారి పర్యటనకు వెళుతున్న ఏడుగురు దుర్మరణం

పెరూలో ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎడారి పర్యటనకు వెళుతున్న ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్​, కోఫైలట్ ఉన్నారు.

Peru: పెరూలో కూలిన విమానం..ఎడారి పర్యటనకు వెళుతున్న ఏడుగురు దుర్మరణం

Peru Nazca Lines

Peru Nazca lines : పెరూలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పెరులో ఎడారిలో పర్యాటక స్థలాన్ని సందర్శించటానికి వెళ్లుతున్న విమానం నాజ్కాలోలో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానం ప్రమాదం గురించి శుక్రవారం (ఫిబ్రవరి 4,2022) పెరు రవాణా,కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్​, కోఫైలట్ ఉన్నట్లు తెలిపారు. పర్యాటకుల్లో ముగ్గురు డచ్ టూరిస్టులు, ఇద్దరు చిలీకి చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.

Huge cat found etched into desert among Nazca Lines in Peru | Peru | The Guardian

పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా..నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో సెన్నా 207 వివామంన కూలిపోయింది. ఆ విమానం ఏరో శాంటోస్‌ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు.

Mystery Behind Peru's Nazca Lines | Blog Cusco Peru Travel

పెరూలో నాజ్కా లైన్లు ప్రపంచ  ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 1,500-2,000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్మక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

The Nazca Lines of Peru: An ancient riddle etched in the earth makes for a perfect family adventure - Los Angeles Times

ఇక్కడికి విదేశీ పర్యాటకుల కోసం మారియా రీచే ఎయిర్‌ ఫీల్డ్‌ నుంచి ప్రతిరోజు డజన్ల కొద్ది విమానాలను నడుపుతారు. 2010, అక్టోబర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు బ్రిటిష్‌ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్‌ విమాన సిబ్బంది మరణించారు.