Water Bottle Cost: ముప్పావు లీటర్ వాటర్ ఖరీదు.. రూ.45లక్షలా

వరల్డ్ కాస్ట్లీ డ్రింక్స్ లక్షల్లో ఉంటాయని తెలుసు కానీ, నీటి బాటిల్ ఖరీదు ఏకంగా రూ.45లక్షలా అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. వైన్స్, విస్కీలు కోట్లలో పలుకుతాయని తెలుసు.

Water Bottle Cost: ముప్పావు లీటర్ వాటర్ ఖరీదు.. రూ.45లక్షలా

Water Bottle

Water Bottle Cost: వరల్డ్ కాస్ట్లీ డ్రింక్స్ లక్షల్లో ఉంటాయని తెలుసు కానీ, నీటి బాటిల్ ఖరీదు ఏకంగా రూ.45లక్షలా అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. వైన్స్, విస్కీలు కోట్లలో పలుకుతాయని తెలుసు. మరి నీళ్ల బాటిల్ కూడా రూ.45లక్షలు కూడా పలుకుతుందిక్కడ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఇదే. యాక్వా ది క్రిస్టల్లో ట్రిబ్యూటో ఏ మోడిగ్లియానీ దీని పేరు.

ఫ్రాన్స్, ఫిజీలోని సహజమైన నీటి బుడగల నుంచి వీటిని సంగ్రహిస్తారు. ఇది అరుదైన ఫినామినో కూడా.

నేటి మార్కెట్‌లో చాలా మినరల్ వాటర్ బాటిల్స్ ఇదే పనిలో పడ్డాయి. కానీ, రూ.50, రూ.150 కూడా అమ్ముడుపోతుండగా రూ.45లక్షలు ఖర్చుపెట్టి తీసుకోవడానికి కారణమేంటంటే..

…………………………………….. : రష్యాలో వరుసగా మూడో రోజు కోవిడ్ విజృంభణ..ఒక్కరోజే వెయ్యికి పైగా మరణాలు

అనూహ్యంగా ధర పలకడానికి బోలెడు కారణాలున్నాయి. బాటిల్ ప్యాక్ చేయడానికి వాడిన మెటేరియల్ 24క్యారెట్స్ గోల్డ్. పైగా వరల్డ్ ఫ్యామస్ బాటిల్ డిజైనర్ ఫెర్నాండో ఆల్టామిరానో రూపొందించారు.

ఎట్టకేలకు బంగారం బాటిల్ లో ఉంచినందుకో మరి దేనికో.. దీని రుచి మామూలు వాటి కంటే బెటర్ గా ఉందని నిపుణులు చెబుతున్నారు.